Begin typing your search above and press return to search.

కరోనాకు చెక్ పెట్టే చీరలు వచ్చేశాయోచ్..!!

By:  Tupaki Desk   |   20 Aug 2020 7:15 AM GMT
కరోనాకు చెక్ పెట్టే చీరలు వచ్చేశాయోచ్..!!
X
వారు.. వీరు అన్న తేడా లేకుండా అందరిని వణికించే కరోనాకు చెక్ పెట్టేలా మధ్యప్రదేశ్ కు చెందిన చేనేత కళాకారులు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినట్లుగా చెబుతున్నారు. చూసినంతనే ఆకర్షించేలా ఉండే.. ఆకర్షణీయమైన చీరల్ని తయారుచేశారు. వీటి స్పెషాలిటీ ఏమంటే.. కరోనా వైరస్ ను దరి చేరనివ్వకపోవటం ఆ చీరల ప్రత్యేకతగా చెబుతున్నారు. ఈ చీరల్ని ధరిస్తే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయట. సుగంధ భరితమైన ఈ ఔషధ చీరలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

ఇంతకూ ఈ చీరల్ని ఎలా తయారు చేస్తారంటే.. ఇందులో యాలకులు.. జాపత్రి.. దాల్చిన చెక్క.. మిరియాలు.. వాము.. బిర్యానీ ఆకు.. వివిధ రకాల పుష్పాలతోపాటు మరిన్ని ముడిదినుసుల్ని చీర తయారీలో వినియోగిస్తారట. ఔషధ చీరలు ధరించిన వారు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సుగంధ మూలికల్ని 48 గంటల పాటు నీటిలో నాబెట్టి తయారు చేసిన రసాన్ని ఆవిరిగా మార్చి ప్రతి చీరకు దశల వారీగా పట్టిస్తారు. ప్రత్యేక నైపుణ్యంతో జాగ్రత్తగా రూపొందించే ఈ ప్రక్రియలో ఒక్కో చీరతయారీకి ఐదారు రోజులు పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం భోపాల్ లో తయారుచేస్తున్న ఈ ఔషధ చీరలు.. త్వరలో హైదరాబాద్ కు వస్తున్నాయట. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లోనే ఈ చీరల్ని అమ్మనున్నట్లు చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతన్నది వాడితే కానీ అర్థం కాదని చెబుతున్నారు.