Begin typing your search above and press return to search.

అమలాపురం లో రూపాయి కి చీరంటే.. ఏం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   2 Jan 2020 10:09 AM GMT
అమలాపురం లో రూపాయి కి చీరంటే.. ఏం జరిగిందంటే?
X
ఇటీవల కాలంలో తమ వ్యాపార సంస్థను ప్రమోట్ చేసుకోవటం కోసం చేస్తున్న పనులు సామాన్యులకే కాదు.. స్థానికంగా కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. తన వ్యాపారం మరింత పెంచుకోవటం కోసం.. ప్రజల నోళ్లల్లో నానటం కోసం చేస్తున్న పని పోలీసులకు సైతం కొత్త కష్టాల్ని తెచ్చి పెడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది.


కాకుంటే.. ఈ తరహా ఆఫర్ల విషయం లో చోటు చేసుకునే పరిణామానికి రివర్స్ ఘటన జరగటమే కాదు.. షాపు యజమానికి దిమ్మ తిరిగే షాక్ తగలింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొత్త సంవత్సరం వేళ.. న్యూఇయర్ ఆఫర్ కింద అమలాపురానికి చెందిన ఒక వస్త్ర దుకాణదారు.. రూపాయి చీర అంటూ ఆఫర్ పెట్టారు.


దీంతో.. పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు తొక్కిసలాటలుచోటు చేసుకుంటాయి. అమలాపురం లో అయితే ఏకంగా భారీగా బారులు తీరిన మహిళలు ఒక్కసారిగా గుంపులు గుంపులు గా షాపులోకి జొరబడి.. చేతికి చిక్కిన చీరల్ని తీసుకెళ్లిపోయారు. దీంతో.. షాక్ తిన్న షాపు యజమాని పరుగు పరుగున వెళ్లి పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రచారం కోసం చేపట్టే ఇలాంటి ఆఫర్లు అసలుకే ఎసరు తీసుకొస్తాయన్న విషయం స్పష్టమైందని చెప్పక తప్పదు.