Begin typing your search above and press return to search.

ప్రధాని పదవి రేసులో రాహుల్ .. ఆ ఒక్కటే సమస్య అంటూ పవర్ కామెంట్స్

By:  Tupaki Desk   |   4 Dec 2020 10:16 AM IST
ప్రధాని పదవి రేసులో రాహుల్ .. ఆ ఒక్కటే సమస్య అంటూ పవర్ కామెంట్స్
X
ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కి రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం , దానితో పాటుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలనే ఆలోచనా తత్త్వం కూడా ఎక్కువే. మహారాష్ట్ర లో సార్వత్రిక ఎన్నికల సమయంలో శరద్ పవర్ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర లో మహావికాస్‌ అఘాడీ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఈయనే కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత ఈ సంకీర్ణ ప్రభుత్వం లో కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ఈ మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది.

ఈ సమయంలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గతంలో ఆ పార్టీ నుంచి విడిపోయి సక్సెస్‌ అయిన శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ చర్చకు దారితీస్తున్నాయి. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఓ జాతీయ మీడియా ఛానల్‌ తో మాట్లాడిన పవార్‌... దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో రాహుల్‌ గాంధీ ఏ మేరకు సమర్ధుడు అని అడిగితే, ఆయన స్ధిరత్వమే ప్రధాన సమస్య అంటూ చెప్పారు. రాహుల్‌ గాందీకి స్దిరత్వం లోపించినట్లు కనిపిస్తోందని, పార్టీలో లుకలుకలు ముగిసి ఆయనకు స్పష్టమైన నాయకత్వం దక్కితే స్దిరత్వం వస్తుంది అంటూ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇక నెహ్రూ, గాంధీ కుటుంబంపై ఉన్న నమ్మకం కూడా ఇందుకు కారణమన్నారు. అలాగే , తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందనపైనా పవార్‌ మాట్లాడారు. ఒబామా వ్యాఖ్యలను రాహుల్‌ అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు.