Begin typing your search above and press return to search.

ఆయన్ను బ్లాక్‌ చేసిన సంజయ్‌ మంజ్రేకర్‌

By:  Tupaki Desk   |   10 July 2019 10:24 AM GMT
ఆయన్ను బ్లాక్‌ చేసిన సంజయ్‌ మంజ్రేకర్‌
X
టీం ఇండియా మాజీ ఆటగాడు గత కొన్ని రోజులుగా సంజయ్‌ మంజ్రేకర్‌ సోషల్‌ మీడియాలో విమర్శల పాలవుతున్న విషయం తెల్సిందే. టీం ఇండియా ఆటగాళ్లపై ఈయన చేస్తున్న కామెంట్స్‌ పై నెటిజన్స్‌ ఇప్పటికే సీరియస్‌ అవుతున్నారు. తాజాగా ఇతర దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు మరియు క్రీడా విశ్లేషకులు కూడా సంజయ్‌ మంజ్రేకర్‌ తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ కూడా సంజయ్‌ మంజ్రేకర్‌ ను విమర్శించడం జరిగింది.

ఇప్పటికే సంజయ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసిన మైకేల్‌ వాన్‌ తాజాగా ఇండియా మరియు న్యూజిలాండ్‌ జట్ల మద్య మ్యాచ్‌ సందర్బంగా జడెజాను పొగడ్తలతో ముంచెత్తాడు. వాన్‌ ట్వీట్‌ తో మరోసారి సంజయ్‌ మంజ్రేకర్‌ పై నెటిజన్స్‌ విమర్శలు చేయడం మొదలైంది. దాంతో మైకేల్‌ వాన్‌ ను సంజయ్‌ మంజ్రేకర్‌ ట్విట్టర్‌ లో బ్లాక్‌ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన వాన్‌ ట్విట్టర్‌ లో.. బ్రేకింగ్‌ న్యూస్‌ నేను సంజయ్‌ మంజ్రేకర్‌ తో బ్లాక్‌ చేయబడ్డాను అంటూ ట్వీట్‌ చేశాడు. దాంతో మరోసారి సంజయ్‌ విమర్శల పాలవుతున్నాడు.

రవీంద్ర జడేజాను గల్లీ క్రికెటర్‌ అంటూ విమర్శించడంతో పాటు.. తన దృష్టిలో అసలు జడేజా ఆల్‌ రౌండర్‌ కానే కాదన్నాడు. ఆయన మాటలకు జడేజా స్పందిస్తూ నీ వాగుడు కట్టిపెడితే బాగుంటుందంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అయినా కూడా సంజయ్‌ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు.