Begin typing your search above and press return to search.

హీరో గారి సెలవులైపోయాయి.. ఇప్పుడు విచారణ!

By:  Tupaki Desk   |   20 Jan 2015 10:59 AM IST
హీరో గారి సెలవులైపోయాయి.. ఇప్పుడు విచారణ!
X
1993 ముంబై వరస పేలుళ్ల కేసులో ఒకానొక కేసులో దోషిగా పూణే సమీపంలోని ఎరవాడ జైల్లో ఉన్న బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ సెలవుల వ్యవహారాన్ని విచారించడం మొదలు పెట్టారు మహారాష్ట్ర హోం శాఖ అధికారులు. జైలు అధికారులు దత్‌కు ఫర్లా పేరుతో సెలవులు ఇవ్వడం, ఆయన ఇంటికి వెళ్లేందుకు సహకరించడం, దత్‌ ఇంట్లో ఉండగానే ఆ ఫర్లాను పొడిగించడం వంటివ్యవహారాల గురించి హోం శాఖ అధికారులు విచారించనున్నారు.

ఐదేళ్ల శిక్ష పడ్డ ఏ ఖైదీకి అయినా ఈ ఫర్లా అవకాశం ఉంటుందట. అయితే సంజయ్‌దత్‌ విషయంలో అది దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వచ్చాయి. నియమాలను అతిక్రమిస్తూ జైలు అధికారులు ఈ బాలీవుడ్‌ హీరోకు ఇంటికెళ్లే అవకాశం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బహుశా బాలీవుడ్‌ హీరో అనే అభిమానంతో దత్‌పై జైలు అధికారుల చల్లనిచూపు పడిందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది హోం శాఖ. దత్‌ విషయంలో నియామాలను ఏమైనా అతిక్రమించారేమో విచారించి చెప్పాలని అధికారులను కోరింది.

మరి ఒకవేళ ఇప్పుడు నిజంగానే దత్‌ వ్యవహారంలో నిబంధనలను అతిక్రమించి ఉంటే చర్యలు ఎవరిపై ఉంటాయి? జైలు అధికారుల పైనేనా? లేక దత్‌ మీద కూడా ఉంటాయా?!