Begin typing your search above and press return to search.

ఆమె ట్వీట్‌: మా సింహం బోను నుంచి బ‌య‌ట‌కు

By:  Tupaki Desk   |   24 Feb 2016 9:19 AM GMT
ఆమె ట్వీట్‌: మా సింహం బోను నుంచి బ‌య‌ట‌కు
X
అక్ర‌మ ఆయుధాల కేసులో దోషిగా నిరూప‌ణ అయి జైలుశిక్ష అనుభ‌విస్తున్న బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ గురువారం విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. 2013లో సంజ‌య్‌ కు జైలుశిక్ష‌ను సుప్రీం ఖ‌రారు చేసింది. అయితే.. ఇదే కేసులో అంత‌కు ముందే 18 నెల‌లు జైలు జీవితాన్ని గ‌డిపిన నేప‌థ్యంతో పాటు జైల్లో స‌త్ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ముందుగా విడుద‌ల‌వుతున్నారు.

త‌న తండ్రి జైలు నుంచి విడుద‌లవుతున్న నేప‌థ్యంలో సంజ‌య్‌ ద‌త్ కుమార్తె త్రిశాలా ద‌త్ సంతోషంతో పెట్టిన ట్వీట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మా సింహం త్వ‌ర‌లో బోనులో నుంచి బ‌య‌ట‌కు రానుందంటూ ఆమె పేర్కొంది. ఈ సంద‌ర్భంగా త‌న తండ్రి న‌టించిన ఒక సినిమాలోని పాట‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అమ్మ‌డి పోస్టింగ్‌ లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి. త‌ప్పు చేసి జైలుకు వెళ్లిన తండ్రిని హీరోగా పొగుడుకోవ‌టం ఏమిటంటూ విమ‌ర్శ‌లు చేసేవారూ లేక‌పోలేదు.

ఇదిలా ఉంటే.. త‌న జైలుజీవితంలో సంజ‌య్‌ ద‌త్ మొత్తంగా రూ.38వేలు సంపాదించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తంలో ఎక్కువ మొత్తం సంజ‌య్ వాడుకోవ‌టంతో విడుద‌ల‌య్యే నాటికి ఆయ‌న ఖాతాలో కేవ‌లం రూ.440 మాత్ర‌మే మిగిలింది.