Begin typing your search above and press return to search.

దేశంలో మొదటగా వ్యాక్సిన్ వేయించుకొని చరిత్ర సృష్టించిన సామాన్యుడు ...ఎవరంటే!

By:  Tupaki Desk   |   16 Jan 2021 9:34 AM GMT
దేశంలో మొదటగా వ్యాక్సిన్ వేయించుకొని చరిత్ర సృష్టించిన సామాన్యుడు ...ఎవరంటే!
X
దేశ చరిత్ర లో మరో కీలకఘట్టం మొదలైంది. కరోనా ను అరికట్టాడనికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించారు. అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌గా ఇది గుర్తింపు పొందింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ లో ఓ పారిశుద్ధ్య కార్మికుడు చరిత్ర సృష్టించాడు. దేశంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఆయన పేరు మనీష్ కుమార్. ఢిల్లీకి చెందిన ఓ సామన్యుడు. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు తొలి కరోనా వ్యాక్సిన్‌ ను అందజేశారు.

కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియాకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు.

హైదరాబాద్‌ లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ మొదటి టీకాను తీసుకున్నారు. దీంతో తెలంగాణ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా ఆమె రికార్డులోకి ఎక్కింది. విజయవాడ జీజీహెచ్‌ లో ఏపీ సిఎం వైఎస్‌ జగన్ ‌ టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా సిఎం జగన్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు ఇచ్చారు.