Begin typing your search above and press return to search.

విషపురుగు అంటూ స్పందించిన సానియా!

By:  Tupaki Desk   |   19 Sep 2016 5:25 AM GMT
విషపురుగు అంటూ స్పందించిన సానియా!
X
గతంలో ఎవరినీనా తిట్టినా - విమర్శించినా నోటికి పనిచెప్పారని.. చేయిచేసుకుంటే చేతికి పనిచెప్పారని అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ పద్దతి మారింది. ఎవరిపై కోపం వచ్చినా ట్వీట్ల రూపంలో తీర్చుకోవడాన్ని కూడా చేతికి పనిచెప్పారనే అనుకోవాలి. ఇదే కరెక్ట్ అయితే.. సానియా మీర్జాకు కోపం వచ్చింది, వెంటనే చేతికి పని చెప్పి ట్విట్టర్ వేదికగా విమర్శల షాట్స్ కొట్టింది.

ఇప్పటికే ముదిరి ముదిరి పాకాన పడుతున్న భారత టెన్నీస్ వివాదం మరోసారి రచ్చకెక్కింది. గత రెండు ఒలింపిక్స్ కు డబుల్స్ జోడీల ఎంపికపై భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అత్యుత్తమ జోడీని డబుల్స్ కు పంపలేకపోయామనే ఆ విమర్శలపై ఆ డబుల్స్ లో ఒకరైన సానియా మీర్జా తీవ్రంగా స్పందించింది. ఫేస్ చేసిన విమర్శలపై స్పందించిన సానియా.. పేస్ పేరును ప్రస్తావించకుండానే చెప్పాలనుకున్నది చెప్పేసింది. ఓ విషపురుగు అంటూ (ఫేస్ ను) విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమంటే అది విజయం సాధించడంతో సమానమని పరోక్షంగా పేస్‌ ను ఉద్దేశించి ట్వీట్ చేసింది.

కగా... గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌ లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని... దాని వల్లే నేటి రియో - గత లండన్ ఒలింపిక్స్‌ లో తగిన మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు. అంటే.. నేరుగా సానియా - బోపన్న లను ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు. దీనిపై సానియా ఆ రేంజ్ లో స్పందించింది.