Begin typing your search above and press return to search.

ఆప్ మంత్రి ‘రసికత్వం’లో కొత్త కోణం

By:  Tupaki Desk   |   2 Sept 2016 11:12 AM IST
ఆప్ మంత్రి ‘రసికత్వం’లో కొత్త కోణం
X
మాటల్లో నీతులు చెప్పినంత ఈజీగా చేతల్లో చేసి చూపించలేరు. ఆ విషయం అక్షరాల నిజం చేస్తోంది ఆమ్ ఆద్మీపార్టీ. ఆదర్శ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వ్యవహరించే ఆమ్ ఆద్మీ పార్టీ నేతల యవ్వారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఢిల్లీ రాష్ట్ర అధికారపక్షంగా అంతరించిన తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రుల మీదా.. నేతల మీద వచ్చిన ఆరోపణలు అన్నీఇన్నీ కావు. తాజాగా ఆప్ మంత్రి సుదీప్ కుమార్ రసిక టేపులు బయటకు రావటం.. అవి ముఖ్యమంత్రి చేతికి చేరిన వెంటనే చర్యలు తీసుకోవటం తెలిసిందే.

తన చర్య ద్వారా తప్పు చేసిన వారికి శిక్ష తప్పన్నట్లు విషయాన్ని స్పష్టం చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే.. ఇదంతా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేశారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నా.. అలాంటి పని ఎన్ని రాజకీయ పార్టీలు చేశాయన్నది ప్రశ్నించుకుంటే కేజ్రీవాల్ తన వరకు తాను చేయగలిగింది చేస్తున్నారనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. సెక్స్ టేపులతో అడ్డంగా బుక్ అయిన మాజీ మంత్రి సుదీప్ కుమార్ కు సంబంధించిన ఆసక్తికర కోణం ఒకటి బయటకు వచ్చింది.

తాజాగా బయటకు వచ్చిన రసిక టేపులు ఇప్పటివి కావని.. అయ్యగారు లా చదువుతున్న రోజుల్లోనివని చెబుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో అభ్యంతరకర పరిస్థితుల్లో కంట పడిన సెక్స్ టేపులకు సంబంధించి మరో యాంగిల్ ఏమిటంటే.. ఆ వీడియోను తీసింది కూడా ఆయననే చెబుతున్నారు. తన వీడియోను తానే తీసుకున్న సుదీప్ తాజాగా బుక్ అయిపోవటం విశేషం. తాజాగా బయటకు వచ్చిన వీడియో ఆరేడేళ్ల కిందటిదని.. విద్యార్థి ఉన్న సమయంలో ఆయనకు ఆయన తీసుకున్నది చెబుతున్నారు. మరోవైపు ఆయన వీడియో మీద స్పందించిన ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు కానీ.. ఆయన భార్య కానీ.. టేపుల్లో ఉన్న మహిళలు కానీ మాజీ మంత్రిగారి మీద ఫిర్యాదు చేయకపోవటం కొంతలోకొంత ఊరటగా చెప్పక తప్పదు. వెధవ వేషాలు వేసేటప్పుడు వీడియోలు తీసుకోవాలన్న నేతాశ్రీ తీరు చూస్తే.. రసిక పాళ్లు ఎక్కువన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.