Begin typing your search above and press return to search.

ఇసుక కొరత ముసుగులో మాఫియా ముప్పేట దాడి

By:  Tupaki Desk   |   5 Nov 2019 8:15 AM GMT
ఇసుక కొరత ముసుగులో మాఫియా ముప్పేట దాడి
X
ఇసుక... ప్రస్తుతం ఏపీలో హాట్‌ టాపిక్‌. ఇసుక కొరత ఉండటం వాస్తవం. భవన నిర్మాణ రంగం కూడా ఇసుక కొరతతో కుదేలయ్యింది అంటూ ప్రతిపక్ష్యాలు తమ రాజకీయ అవసరాల కోసం ఆందోళనలు చేపట్టాయి. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఎలా చెరేగిపోయిందో మనం చూశాం. దానిని సరిచేయడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు చోటు లేకుండా కొత్త పాలసీను తీసుకురావాలనుకుంది. ఇలోగా రాష్ట్రంలో వరదలు రావడంతో ఇసుక తీయడానికి అవకాశం లేకుండా పోయింది. దాదాపు 2 నెలల నుండి గోదావరి, కృష్ణా నదులు వరదతో ఉప్పొంగుతున్నాయి. దాంతో ఇసుక రావాణ ఆగిపోయింది. ఇదే అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకపైన రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది.

ఇసుక మాఫియాను అరికట్టించి ప్రజలకు సులువుగా ఇసుకు సరఫరా చేయాలనేది ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచన. ఈ ఆలోచన ఆచరణలో జాప్యం జరగడంతో పాటు ఊహించని విధంగా నదులు వరదతో పోటేత్తడంతో అసలు ఇసుకే లభించని పరిస్థితి నెకొంది. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలోని ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచిస్తుంటే అధికారులు, మంత్రుల నిర్లిప్తత, మరోవైపు ప్రకృతి సహకరించకపోవడంతో ఇది తీవ్ర రాజకీయ  రూపం దాల్చింది.

రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరినదుల్లో వరద కొనసాగుతోంది దీనివల్ల ప్రధానమైన రీచ్‌ల  నుంచి ఇసుకను అందించలేక పోతున్నారు. నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో అయిదు వేల టన్నుల ఇసుకను అందించగా, నేడు దానిని నలబై అయిదు వేల టన్ను మేరకు పెంచారు. ఈ పరిస్థితుల్లో ఇసుక కొరత ఉత్పన్నమైంది. దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. నవంబర్‌ చివరినాటికి ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో చెలరేగినఇసుక మాఫియా
వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక విక్రయాల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక వ్యాపారులుగా అవతారం ఎత్తారు. కొందరైతే మాఫియా తరహాలో అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇచ్చారు. టన్ను ఇసుక వేల రూపాయల ధర పలికింది. అప్పట్లో ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు, ఉచితంగా ఇసుక అంటూ విధానాలు ప్రకటించినప్పటికీ ప్రజలకు అందింది శూన్యం. ఇసుకాసురులుగా నాటి తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు.

భవిష్యత్తులో లేకుండా ..

వరదల కారణంగా నదుల్లో దాదాపు పది కోట్ల టన్నుల ఇసుక మేట వేసిందని తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో అయిదేళ్లకు సరిపడ్డ ఇసుక నిల్వలు రాష్ట్రంలో వున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టగానే ఇసుక రీచ్‌ నుంచి కావాల్సినంత ఇసుకను ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వినియోగదారులకు చేరేలా అధికాయి చర్యలు తీసుకుంటున్నారు.