Begin typing your search above and press return to search.

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత ఏ పార్టీ?

By:  Tupaki Desk   |   28 Jan 2021 8:00 AM IST
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత ఏ పార్టీ?
X
విజయనగరం రాజవంశీయుడు, టీడీపీ మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజుకు చెక్ పెట్టి వారి ఆస్తు పాస్తులపై అధికారాన్ని ఆయన అన్న కూతురు సంచయితకు కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం. అలా అశోక్ గజపతికి షాకిచ్చింది.. వైసీపీ అంచనాలకు మించి గజపతిరాజుల కుటుంబంలో సంచయిత చిచ్చుపెట్టింది. ఇంకా పెడుతూనే ఉందన్న విమర్శలు జిల్లాలో వినిపిస్తున్నాయి.

సంచయిత ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ సంచలనం. వేల ఎకరాలు, విద్యాసంస్థలు, 105 దేవస్థానాలు కలిగిన మాన్సాస్ ట్రస్ట్ కు ఆమె చైర్మన్, సింహాచలం దేవస్థానానికి సైతం ఆమెనే వైసీపీ సర్కార్ నియమించింది.ఆనంద గజపతిరాజు కుమార్తెగా తెరపైకి వచ్చిన సంచయిత అనంతరం రాజకీయ వేత్తగా కూడా అడుగులు వేస్తున్నారు.అశోక్ గజపతిరాజు లక్ష్యంగా తాజాగా సోషల్ మీడియాలో బాణాలు ఎక్కుపెడుతున్నారు. టీడీపీ నేతలను ఆమె వదలడం లేదు.రాజకుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ఆమె మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా రాకముందు ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వైసీపీ ప్రోద్బలంతో విజయనగరం వచ్చి మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే బీజేపీ నుంచి సస్పెండ్ చేశారని అంటున్నారు. కానీ బీజేపీనే తన పార్టీ అని సంచయిత అంటోంది. మరోవైపు వైసీపీ ప్రతినిధిగానూ ఆమె వ్యవహరిస్తున్నట్టు ప్రవర్తిస్తారు. చంద్రబాబును, అశోక్ గజపతిరాజుపై పదునైన విమర్శలు చేస్తారు.. ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అశోక్ గజపతి-చంద్రబాబు నాడు ఎన్టీఆర్ కు చేసిన ద్రోహాన్ని పాత లేఖను బయటపెట్టి సంచయిత సంచలనం సృష్టించారు. వైసీపీ పెద్దల ఆశీస్సులతోనే ఆమె ఇలా చేస్తోందని అనేవారు ఉన్నారు. అయితే ఓపెన్ గా ఆమె వైసీపీ కార్యకలాపాల్లో పాలుపంచుకోదు. దీంతో ఇప్పుడు సంచయిత బీజేపీనా? వైసీపీనా అన్న మీమాంస అందరిలోనూ నెలకొంది.