Begin typing your search above and press return to search.
సంచయిత మరో సంచలన నిర్ణయం.. !
By: Tupaki Desk | 28 Dec 2020 1:15 PM ISTమాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత.. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ట్రస్ట్ చైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నిక దగ్గరి నుంచి విజయనగరం ట్రస్ట్ వ్యవహారాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి. గతంలో ఆ ట్రస్ట్ టీడీపీ నేత అశోకగజపతిరాజు ఆధీనంలో ఉండేది. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, గతంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు విజయనగరంలో బలమైన నేత. చంద్రబాబునాయుడుకు అత్యంత నమ్మకస్తుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే మాన్సస్ ట్రస్ట్ చైర్మన్‌గా ఆయన ఉన్న కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. ట్రస్ట్ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం.. పరోక్షంగా జోక్యం చేసుకొని ఆయనను ట్రస్ట్ కార్యకలాపాల నుంచి తప్పించింది.
ఆ స్థానంలో అదే కుటుంబానికి చెందిన సంచయిత బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టాక ట్రస్ట్ వ్యవహారం ఏపీలోనే హాట్ టాపిక్‌గా మారాయి. ట్రస్ట్ చైర్మన్‌గా ఆమె నియామకం కావడాన్ని అశోకగజపతిరాజుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. అశోకగజపతిరాజు అస్సలు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీ కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. మరోవైపు తనమీద వచ్చిన ఆరోపణలను సంచయిత దీటుగా ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌కు సైతం ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
అయితే తాజాగా సంచయిత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకూ మాన్సస్ రెవెన్యూ కార్యాలయం విజయనగరం రాజాగారి కోటలోనే ఉంది. అయితే ఈ కార్యాలయాన్ని ఆమె విశాకజిల్లాకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ మెమో విడుదల చేసింది మాన్సస్ యజమాన్యం. పద్మనాభం మండలంలోని మూడున్నర ఎకరాలలో ఉన్న ఎమ్ ఆర్ వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలకు ఈ రెవెన్యూ కార్యాలయాన్ని తరలించనున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమలు అవుతుందంటూ మెమోలో పేర్కొన్నారు. చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మెమోలపై సంతకాలు చేశారు. 1958 లో పీవీజీ రాజు స్థాపించిన మాన్సస్ రెవెన్యూ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతోంది. అయితే ఈ నిర్ణయంపై గజపతిరాజుల కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.