Begin typing your search above and press return to search.

చైనాకి బిగ్ షాకిచ్చిన సామ్ ‌సంగ్ ... భారత్‌ లో రూ. 4,825 కోట్లు పెట్టుబడి !

By:  Tupaki Desk   |   13 Dec 2020 7:00 AM IST
చైనాకి బిగ్ షాకిచ్చిన సామ్ ‌సంగ్ ...  భారత్‌ లో రూ. 4,825 కోట్లు పెట్టుబడి !
X
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ సామ్ ‌సంగ్ భారత్ ‌లో రూ.4825 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతోంది. ఇప్పటి వరకూ చైనాలో ఉన్న మొబైల్ అండ్ ఐటీ డిస్‌ ప్లే ప్రొడక్షన్ యూనిట్‌ ను త్వరలోనే ఉత్తర ప్రదేశ్ కి తరలించనుంది. ఈ విషయాన్ని యూపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడడించారు. ప్రపంచంలో ఇలాంటి యూనిట్ ఉన్న మూడో దేశంగా భారత్ నిలవనుందని ఆయన వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా 1500 మంది ఉపాధి పొందుతారని తెలిపింది. ప్రజలకు వేల సంఖ్యలో పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొంది.

ఈ క్రమంలో శామ్‌ సంగ్‌ కు ఇచ్చే ప్రోత్సాహకాలకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కేబినెట్ శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సామ్‌ సంగ్ సంస్థకు నోయిడాలో మొబైల్ ఉత్పత్తి యూనిట్ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని 2018లో ప్రారంభించారు. ఇక యూపీ నుంచి అత్యధికంగా ఎగుమతులు చేస్తున్న సంస్థ శామ్‌సంగ్. గత ఏడాది 2.7 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కంపెనీ విదేశాలకు ఎగుమతి చేసింది. వచ్చే ఐదేళ్లో వీటి విలువను 50 బిలియన్ డాలర్ల పెంచాలని టార్గెట్ పెట్టుకుంది

ఇప్పటి వరకూ సామ్‌సంగ్ టీవీ సెట్లు, మొబైల్స్, వాచీలు, ట్యాబ్లెట్లలో వాడే డిస్ ‌ప్లే ఉత్పత్తుల్లో 70 శాతం దక్షిణ కొరియా, వియత్నాం, చైనాల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రొడక్షన్ అనుసంధానిత రాయితీల పథకం కింద భారత ప్రభుత్వం యాపిల్ సంస్థ భాగస్వాములైన ఫాక్స్‌ కాన్, విస్ట్రన్, పెగాట్రాన్‌ కు అనుమతులు ఇచ్చిన తర్వాత సామ్‌ సంగ్ తమ డిస్‌ ప్లే యూనిట్‌ను భారత్‌ కు తరలించనున్నట్లు ప్రకటించింది. రూ.15 వేల ధరలో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేయడం కోసం ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇన్సెంటివ్‌లు ఇస్తుంది. పీఎల్ఐ స్కీమ్ కింద 40 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్లను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు.