Begin typing your search above and press return to search.

చేనేత వస్త్రాలకు మనమ్మాయిలు లేరా కేటీఆర్?

By:  Tupaki Desk   |   1 Feb 2017 10:21 AM IST
చేనేత వస్త్రాలకు మనమ్మాయిలు లేరా కేటీఆర్?
X
మిగిలిన వారిని ఇలాంటి ప్రశ్నలు వేయలేం. తెలంగాణ ఉద్యమ సమయంలో మన ప్రాంతం.. మన ప్రజలు అన్నట్లుగా నినాదాలు చేయటమే కాదు.. ఏఎంపిక జరిగినా.. అందులో తెలంగాణ కోణాన్ని బయటకు తీసిన వారిలో మంత్రి కేటీఆర్ ఒకరు. ఉద్యమ నాయకుడిగా వ్యవహరించిన ఆయన.. ఇన్ని కోట్ల మంది తెలంగాణ వారు ఉంటే.. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదా? ఇదంతా సీమాంధ్ర ప్రభుత్వాల దుర్మార్గం అంటూ తిట్టిపోసేవారు. అప్పట్లో ఇదంతా నిజమని నమ్మినోళ్లు కోట్లల్లో ఉండేవారు. అలా కాదంటూ ఎవరైనా మాట్లాడితే.. వారిని తప్పు పట్టేశారు.

తెలంగాణ ఉద్యమం ముగిసింది. కొత్త రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ సర్కారు కొలువు తీరింది. ఈ మధ్య కాలంలో చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఆయన స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తూ చేనేత వస్త్రాలకు సరికొత్త ఇమేజ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. కాకుంటే.. చేనేత వస్త్రాలకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ సినీ నటి.. అక్కినేని ఇంటికి రానున్న కొత్త కోడలు సమంతను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా మంత్రి కేటీఆర్.. సమంతలు మెట్రో రైల్ భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న చేనేత వస్త్రాలకు బ్రాండ్అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరటం.. ఆమె ఓకే అనేయటం జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఒక తమిళ అమ్మాయి అవసరం ఏమిటన్నది? సమంత తెలుగులో టాప్ హీరోయిన్ కదా అని అడగొచ్చు. హైదరాబాద్ లో పుట్టి.. పెరిగినా సీమాంధ్ర మూలాలు ఉంటే వారిని ఆంధ్రోళ్లుగా ఉద్యమ సమయంలో అభివర్ణించే కేటీఆర్ లాంటి ఉద్యమ నేత.. తమిళ రాష్ట్రానికి చెందిన మహిళను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయటం ఏమిటి? ఇన్ని కోట్ల మంది ఉన్న తెలంగాణలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ప్రముఖ మహిళలే లేరా..?అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తంచేస్తున్నారు. నిజమే.. వారి వాదనల్లోనూ పాయింట్ ఉందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/