Begin typing your search above and press return to search.

సంప‌న్న‌మైన‌ పార్టీగా టీఆర్ ఎస్‌..ఏ నంబ‌రులో ఉందంటే

By:  Tupaki Desk   |   8 March 2019 5:06 PM GMT
సంప‌న్న‌మైన‌ పార్టీగా టీఆర్ ఎస్‌..ఏ నంబ‌రులో ఉందంటే
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీ మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం గళం విప్పి స్వ‌రాష్ట్రం ఏర్ప‌డిన అధికారం సొంతం చేసుకోవ‌డమే కాకుండా వ‌రుస‌గా రెండో ద‌ఫా ఎన్నిక‌ల్లో గెలుపొందిన గులాబీ పార్టీ అత్యంత సంపన్న పార్టీ జాబితాలో నిలిచింది. టాప్ 3 సంప‌న్న పార్టీగా గుర్తింపు పొందింది. దేశంలో అత్యంత సంప‌న్న‌మైన ప్రాంతీయ పార్టీగా స‌మాజ్‌ వాదీ పార్టీ నిలిచింది.

అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ సంస్థ 37 ప్రాంతీయ పార్టీల ఆదాయ - ఖ‌ర్చుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఏడీఆర్ త‌న రిపోర్ట్‌ లో మొత్తం 2017-18 సంవ‌త్స‌రానికి ఈ రిపోర్ట్‌ ను త‌యారు చేసింది. సంప‌న్న‌వంత‌మైన ప్రాంతీయ పార్టీల‌ జాబితాలో డీఎంకే - టీఆర్ ఎస్‌ లు త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. టాప్ త్రీలో ఉన్న పార్టీల ఆదాయం మొత్తం 237.27 కోట్లుగా ఉంద‌ని రిపోర్ట్ పేర్కొన్న‌ది. అఖిలేశ్ యాద‌వ్‌ కు చెందిన ఎస్పీ పార్టీ ఆదాయం 47.19 కోట్లుగా ఉంది. 37 పార్టీల ఆదాయంలో ఇది 19.89 శాతం కావ‌డం విశేషం. డీఎంకే ఆదాయం 35.748 కోట్లు కాగా - టీఆర్ ఎస్ ఆదాయం 27.27 కోట్లుగా ఉంద‌ని రిపోర్ట్ తెలిపింది. మిగితా 34 పార్టీల ఆదాయం గ‌త ఏడాది త‌గ్గిన‌ట్లు రిపోర్ట్ పేర్కొన్న‌ది. విరాళాలు - మెంబ‌ర్‌ షిప్ ఫీజ్‌ - స‌బ్‌ స్క్రిప్ష‌న్‌ ల ద్వారా ఆయా పార్టీలకు ఆదాయం వ‌స్తున్న‌ద‌ని ఏడీఆర్ తెలిపింది. ఫీజులు - స‌బ్‌ స్క్రిప్ష‌న్ల రూపంలో టీఆర్ ఎస్‌ కు అత్య‌ధికంగా 22.909 కోట్లు వ‌చ్చిన‌ట్లు రిపోర్ట్ వెల్ల‌డించింది. ఎన్నికల సంఘానికి జాతీయ పార్టీలు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లను పరిగణనలోకి తీసుకొని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ ఈ నివేదిక రూపొందించింది.