Begin typing your search above and press return to search.

చైనా వ్యాపారి పైత్యం చూశారా?

By:  Tupaki Desk   |   28 Sept 2016 4:00 AM IST
చైనా వ్యాపారి పైత్యం చూశారా?
X
పేరుకి అది కమ్యునిస్టుల దేశం... పద్దతులూ - వ్యవహారాలు - విధానాలు అబ్బో.. అంతా పద్దతి ప్రకారం అని చెబుతుంటారు. అయితే ఈ కమ్యూనిస్టుల పాలనలోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.. పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం వెనుకడుగు వేసే జుగుప్సాకరమైన పద్దతులను అనుసరిస్తుంది. యావత్ ప్రపంచం "ఛీ..." అనేలా వారి వ్యాపారం వికృత పోకడలు పోతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనపై చైనా దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం సైతం భగ్గుమంటుంది.

విషయానికొస్తే... చైనాలో అతిపెద్ద ఆభరణాల కంపెనీ తన వ్యాపార అభివృద్ధికి ఒక అసభ్యకరమైన పనిచేసింది. చైనా - హాంకాంగ్ లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించే "చావ్ లుక్ ఫొక్" అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఈ కంపెనీ ఈ మధ్యకాలంలో కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆ వజ్రాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిలను ఆఫ్ న్యూడ్ షో రూం బొమ్మల్లా మార్చేసింది. కొత్త డైమండ్లను సూచిస్తూ ఒంటి పైభాగంలో అచ్ఛాదనలేని అమ్మాయిలను జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టింది. ఈ రకంగా కస్టమర్లను ఆకట్టుకోవాలనే నీచమైన పనికి ఒడిగట్టింది.

ఆ వజ్రాల స్టోర్ లోకి ప్రవేశించగానే.. ఇబ్బందికరంగా నిల్చున్న ఆ (టాప్ లెస్) అమ్మాయిలను చూసి కొనుగోలుదారులంతా అవాక్కవాగా, కొందరైతే కంపెనీ తీరును వారిముందే తప్పుపట్టారు. ఇక నెటిజన్లు అయితే చైనా కంపెనీ తీరును ఏకిపారేస్తున్నారు. ఏ రకంగా చూసినా ఈ ఆభరణాల కంపెనీ చర్య సమర్థనీయం కాదని, దీని లైసెస్సులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/