Begin typing your search above and press return to search.

అపర కుబేరుడు అంబానీ జీతం తీసుకోలేదా?

By:  Tupaki Desk   |   4 Jun 2021 5:30 AM GMT
అపర కుబేరుడు అంబానీ జీతం తీసుకోలేదా?
X
మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ధనవంతుడైన భారత్ లోనే నంబర్ 1 కుబేరుడు ముఖేష్ అంబానీ తన ప్రధాన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి జీతం తీసుకోలేదు. ఎందుకంటే కరోనా కల్లోలం వేళ అంబానీ తన వ్యాపారాన్ని.. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న ఈ మహమ్మారి సమయంలో స్వచ్ఛందంగా తన జీతాన్ని అంబానీ వదులుకున్నాడు.

రిలయన్స్ తన తాజా వార్షిక నివేదికలో, 2020-21 ఆర్థిక సంవత్సరానికి అంబానీ వేతనం తీసుకోలేదు అని తెలిపాయి.. మునుపటి ఆర్థిక సంవత్సరంలో అతను సంస్థ నుండి రూ.15 కోట్ల జీతం తీసుకున్నాడు.. అంతకుముందు 11 సంవత్సరాలలో మాదిరిగానే భారీగానే వేతనం తీసుకున్నారు. అంబానీ 2008-09 నుంచి జీతం, పెర్క్విజిట్స్, అలవెన్సులు మరియు కమీషన్లు మొత్తం కలిపి దాదాపు ప్రతీనెల రూ .15 కోట్లు వేతనం తీసుకుంటున్నారు. ఇది 2021 సంవత్సరానికి గాను ప్రతీనెల రూ .24 కోట్లకు పైగా వేతనం ఉంది.

"భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తి విస్తృతమైంది. దేశం సామాజిక, ఆర్థిక మరియు పారిశ్రామిక వృద్ధిపై భారీగా దెబ్బపడింది. రిలయన్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి. అంబానీ ఈ కష్టకాలంలో స్వచ్ఛందంగా తన జీతం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు" గత ఏడాది జూన్‌లో కంపెనీ తెలిపింది. అతని బంధువులైన నిఖిల్, హితాల్ మెస్వానీల వేతనం మాత్రం తీసుకున్నారు. వారి వేతనాలన్నీ కలిపి రూ.24 కోట్ల వరకు ఉన్నాయి.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పిఎంఎస్ ప్రసాద్ మరియు పవన్ కుమార్ కపిల్ రెండేళ్లపాటు పెర్ఫార్మెన్స్-లింక్డ్ ప్రోత్సాహకాలను పొందిన తరువాత వారి పారితోషికం పెరిగింది. ప్రసాద్ 2020-21లో రూ .1199 కోట్లు వసూలు షేర్ గా పొందారు. ప్రసాద్ మరియు కపిల్ చెల్లింపులో "2019-20 ఆర్థిక సంవత్సరం మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికి పనితీరు-అనుసంధాన ప్రోత్సాహకాలు తీసుకున్నారు" అని వార్షిక నివేదిక తెలిపింది.

కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబానీ భార్య నీతా సంవత్సరానికి రూ .8 లక్షల సిట్టింగ్ ఫీజు, మరో రూ .1.65 కోట్ల కమీషన్ సంపాదించింది. అంబానీతో పాటు, ఆర్‌ఐఎల్ బోర్డులో మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు హోల్‌టైమ్ డైరెక్టర్లుగా ఉన్నారు.

నీతా అంబానీతో పాటు, ఇతర నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో యోగేంద్ర పి త్రివేది, దీపక్ సి జైన్, రఘునాథ్ ఎ మషెల్కర్, ఆదిల్ జైనుల్‌భాయ్, రమీందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ, మాజీ ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, మాజీ సివిసి కె వి చౌదరి ఉన్నారు. స్వతంత్ర డైరెక్టర్లందరికీ సంవత్సరానికి రూ .1.65 కోట్ల కమీషన్ లభించింది, సిట్టింగ్ ఫీజుతో పాటు రూ .36 లక్షలు అదనంగా లభించాయి.