Begin typing your search above and press return to search.

కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:34 AM GMT
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు
X
జీతాల వివాదం నేపథ్యంలో కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ అందుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం కాకుండా తమకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటు ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తగ్గుతాయని ఉద్యోగుల సంఘం నేతలు ఆందోళన చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏమో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు పెరుగుతాయే కానీ తగ్గవని వాదిస్తోంది.

రెండువైపులా ఎవరి వాదనకు వాళ్ళు నిలబడటంతో వివాదం బాగా పెరిగిపోయింది. కొత్త పీఆర్సీ ప్రకారం మొదటి నెల జీతం అందుకున్న తర్వాత జీతాలు పెరిగాయా తగ్గాయా అన్నది చూసుకుని మాట్లాడమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉద్యోగుల నేతలకు చెప్పిన వినకుండా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే 1,2 తేదీల్లో జీతాలు, పెన్షన్లు వేసేస్తే ఉద్యోగులు, పెన్షనర్లే జీతాల పెరుగుదల, తగ్గుదలను లెక్కించుకుంటారని ప్రభుత్వం డిసైడ్ చేసింది.

అందుకనే కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు వేయటానికి ఏర్పాట్లు చేసింది. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్) పద్దతిలో పెన్షన్లు, బిల్లుల ప్రాసెసింగ్ ద్వారా జీతాలు వేయటానికి రంగం సిద్దం చేసింది. మంగళ, బుధవారాల్లో జీతాలు, పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయి. అందుబాటులోని సమాచారం ప్రకారం ఉద్యోగుల జీతాల బిల్లులు రెండు లక్షల వరకు అందాయి. అలాగే సుమారు 6 లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ పడిపోతుంది.

సోమవారం రాత్రికి 1 లక్షమంది ఉద్యోగుల జీతాల బిల్లులు ప్రాసెస్ అయిపోయాయి. ఉద్యోగులు, పెన్షన్ల పే స్లిప్పులను ఆన్ లైన్లో ఆర్ధికశాఖ అప్ లోడ్ చేసేసింది. ఈ పే స్లిప్పుల ద్వారా తమ జీతాల వివరాలను ఉద్యోగులు, పెన్షనర్లు తెలుసుకోవచ్చు. జీతాల్లో పెరుగుదల కనిపిస్తే సమ్మెకు ఉద్యోగులు ఎక్కడ దూరమైపోతారో అనేది ఉద్యోగ సంఘాల నేతల టెన్షన్. అందుకనే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దే వద్దంటు గోల చేస్తున్నది. 5 డీఏలు కలవటం వల్ల జీతాల్లో పెరుగుదల కనిపిస్తుందని నేతలు వాదిస్తున్నారు. ఏ పద్ధతిలో అయితే జీతాలు పెరిగాయా లేదా అన్నదే ప్రధానమని ప్రభుత్వం వాదిస్తోంది. చివరకు ఏమవుతుందో చూద్దాం.