Begin typing your search above and press return to search.

‘లేడీ సుల్తాన్’ పై కాసుల వర్షం కురుస్తోంది

By:  Tupaki Desk   |   18 Aug 2016 1:06 PM GMT
‘లేడీ సుల్తాన్’ పై కాసుల వర్షం కురుస్తోంది
X
కోట్లాది మంది ఆశల్ని.. ఆకాంక్షల్ని నిజం చేసిన లేడీ సుల్తాన్ సాక్షి మాలిక్ పై కాసుల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్ మొదలై ఇన్ని రోజులైనా పతకాల పట్టికలో ఇంతవరకూ బోణీ కొట్టని భారత్ కు తన అసమాన పోరాటంతో కాంస్యాన్ని తెచ్చి ఇచ్చిన సాక్షిపై పలువురు నజరానాలు ప్రకటిస్తున్నారు. మహిళల ఫ్రీస్టైల్ 58 కేజీల రెజ్లింగ్ విభాగంలో సాధించిన విజయానికి హర్యానా ప్రభుత్వం స్పందించి ఆమెకు రూ.2.5కోట్ల నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కేంద్రక్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డు కింద రూ.20లక్షలు ప్రకటించింది.

రైల్వే శాఖ రూ.60 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించగా.. భారత ఒలింపిక్ సమాఖ్య తొలిసారి కాంస్యం సాధించిన విజేతకు రూ.20లక్షలు ప్రకటించింది. వీరితో పాటు ఒలింపిక్స్ కు రాయబారిగా వ్యవహరిస్తున్న రీల్ సుల్తాన్ రూ.లక్ష ఇవ్వనున్నారు. నిన్నటివరకూ కొద్ది మంది క్రీడాభిమానులకే తెలిసిన సాక్షి తన తాజా విజయంతో దేశ వ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఆ స్టార్ డమ్ ముందు ఆమెపై కురుస్తున్న కాసులు చాలా తక్కువేనని చెప్పక తప్పదు.