Begin typing your search above and press return to search.
రంగంలోకి సజ్జనార్.. సైదాబాద్ రేప్ కేసు నిందితుడి కోసం బస్లాండ్లలో వేట
By: Tupaki Desk | 15 Sept 2021 6:00 PM ISTహైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీస్ శాఖలో తనదైన ముద్ర వేసి ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బదిలీ అయిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ సైతం ప్రస్తుతం రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ తాజాగా ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
నిందితుడిని గుర్తిస్తే వెంటనే 9390616366, 9490616627 అనే నంబర్లకు కాల్ చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా అప్రమత్తమయ్యారు. నిందితుడు మద్యం మత్తుల్లో బస్టాండ్లలో నిద్రపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి కేసులను చేధించడంలో ఐపీఎస్ సజ్జనార్ కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన నిందితుడిని గాలించేందుకు తెలంగాణ ఆర్టీసీని అలెర్ట్ చేశారు. బస్ స్టేషన్లు, బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
ఆర్టీసీ బస్సుల్లో నిందితుడు ప్రయాణించే అవకాశం ఉందని.. ప్రతి బస్సులో , బస్టాండ్లలో నిందితుడి ఫొటోను పెట్టాలని సజ్జనార్ ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతోపాటు సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు. నిందితుడు రాజు కదలికలు ఉన్నట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై ఆటో డ్రైవర్ రాజు(30) హత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా చంపేశాడు. ఇదిప్పుడు తెలంగాణలో సంచలనమైంది. ప్రజలు, నెటిజన్లు ఆందోళన బాటపడుతున్నారు. నిందితుడు తప్పించుకోవడంతో అతడి సమాచారం ఇస్తే ఏకంగా రూ.10లక్షలు రివార్డ్ ఇస్తామంటూ రాజు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రకటించారు.