Begin typing your search above and press return to search.

సజ్జల గర్జన : ఎంపీ మాధవ్ మీద యాక్షన్ కి రెడీ...?

By:  Tupaki Desk   |   4 Aug 2022 1:38 PM GMT
సజ్జల గర్జన : ఎంపీ మాధవ్ మీద యాక్షన్ కి రెడీ...?
X
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం అవుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అని చెబుతున్నాయి. తెల్లారుతూనే ఎంపీ గారి న్యూడ్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది ఏకంగా ఏపీ రాజకీయాలనే కాదు దేశాన్ని కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఎందుచేతనంటే ఒక వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపధ్యం ఉంది.

అలాంటి వేళ ఒక ఎంపీ గారు ఇలా న్యూడ్ గా మహిళల్తో వీడియో కాల్ లో ఉన్నారు అంటే అది రచ్చ రచ్చగానే చూస్తున్నారు. దీని మీద వైసీపీ రియాక్ట్ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ఆ వీడియో నిజమైతే కచ్చితంగా యాక్షన్ ఉంటుందని, సరైన గుణపాఠంగానే చర్యలు ఉంటాయని సజ్జల అంటున్నారు.

అదే టైమ్ లో గోరంట్ల ఆ వీడియో తనది కాదని, మాఫింగ్ చేశారని చెప్పారని కూడా పేర్కొనడం విశేషం. దీని మీద ఆయన పోలీస్ కంప్లైంట్ చేశారని గుర్తు చేశారు. నిజానిజాలు వెలుగు చూసిన మీదటనే సరైన చర్యలు ఉంటాయని ఆయన అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ వీడియో కాదు కానీ వైసీపీ బాగా ఇరుకున పడిపోయింది.

ఆ పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా వీడియో ఉందని అంటున్నారు. ఈ పరిణామంతో పార్టీలో కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇదే టైమ్ లో గతంలో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ కానీ ప్రస్తుత మంత్రి అంబంటి రాంబాబు కానీ మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో టేపుల మీద ఇప్పటికీ విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే అది ఏదో విధంగా మరుగున పడింది అనుకుంటే గోరంట్ల వివాదం కాక రేపుతోంది.

ఆయన్ని అలా వదిలేస్తే భారీ నష్టం పార్టీకి వస్తుంది. అలాగని చర్యలు తీసుకుంటే అంబటి, అవంతిల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మొత్తానికి వైసీపీ డైలామాలో ఉంది. అయితే ఇది విపక్షాలకు ఆయుధంగా మారింది. దీన్ని ముంచు పెట్టి వైసీపీని బదనాం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ ఈ తలనొప్పి నుంచి ఎలా బయటపడతారో తెలియదు అనే అంటున్నారు.