Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తీరు ఇండస్ట్రీ వారికే నచ్చట్లేదు: సజ్జల

By:  Tupaki Desk   |   28 Sept 2021 5:00 PM IST
పవన్ కళ్యాణ్ తీరు ఇండస్ట్రీ వారికే నచ్చట్లేదు: సజ్జల
X
జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను సినిమా పెద్దలే గుదిబండగా భావిస్తున్నారని సజ్జల ఆరోపించారు. పవన్ లాంటి వారితే ఇబ్బంది పడుతామని సినిమా వారే భావిస్తున్నారని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమకు వైసీపీ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తోందని సజ్జల చెప్పుకొచ్చారు. తాము చేస్తున్న మంచి పనులను అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్ కళ్యాణ్ కే ఇబ్బంది.. ఆయనను సినీ పరిశ్రమ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారని సజ్జల తెలిపారు. పవన్ సినిమాలు, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారు.. పవన్ లాంటి వారితో ఇబ్బంది పడుతామని సినిమా వారే అంటున్నారని తెలిపారు.

ఆన్ లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని.. ఈ విధానంతో పారదర్శకత సాధ్యం అని సినీ పరిశ్రమ వారితో చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని సజ్జల తెలిపారు.

బాహుబలి లాంటి సినిమాకు తొలి వారం 50శాతం టికెట్లు బుక్ అయినట్లు చూపారని.. అంతకంటే ఘోరం ఉంటుందా? అని సజ్జల తెలిపారు. బాహుబలి టికెట్ల అంశంపై ఒక సారి చెక్ చేయాలని.. అదే నిజమైతే సగం టికెట్లే అమ్ముడైనట్లు చూపితే మోసం చేసినట్టేనన్నారు.

సినిమా థియేటర్లు ఎవరి చేతుల్లో ఉన్నాయో అందరికీ తెలుసు అని.. పవన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మటన్ షాపులు పెడుతారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ఆలోచిస్తోందన్నారు.