Begin typing your search above and press return to search.

ఆయన్ను పట్టుకుంటే ఎన్ని లక్షల, వేల కోట్లో..

By:  Tupaki Desk   |   14 Feb 2020 3:30 PM IST
ఆయన్ను పట్టుకుంటే ఎన్ని లక్షల, వేల కోట్లో..
X
ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన దాడుల్లో రూ.2 వేల కోట్లు కోట్లు బయటపడడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. భారీగా నిధుల బదలాయింపు బయటపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలకు దారి తీసింది. వైఎస్సార్సీపీ, తెలుగు దేశం పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనిపై టీడీపీ నాయకులు అప్రమత్తం కాగా అధికార పార్టీ నాయకులు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ ఐటీ దాడులపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విటర్ లో స్పందించారు. “పర్సనల్‌ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయి. మరి చంద్రబాబును పట్టుకుంటే… ఎన్ని వేల కోట్లో! లక్షల కోట్లు అడ్డంగా సంపాదించారన్నది అక్షరాల నిజం కాదా? ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి?” అంటూ పోస్ట్ చేశారు. అంటే చంద్రబాబు నివాసం లో దాడులు చేస్తే ఇంకా ఎన్ని లక్షల, వేల కోట్ల రూపాయలు పట్టుబడతాయోనని సందేహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈ అవినీతిపై ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ హాట్ టాపిక్ ను అందరూ చర్చించుకుంటున్నారు. దీన్నంతటిని చంద్రబాబు హయంలో జరిగిందని, అందుకు చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై దర్యాప్తు వేగంగా చేస్తే మరికొన్ని విస్తుగొల్పే విషయాలు బహిర్గతమవుతాయని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇంకా టీడీపీ నాయకులు నోరు మెదపడం లేదు.