Begin typing your search above and press return to search.

హైకోర్టుపై యుద్ధాలా? ఏంటీ రాతలు: సజ్జల

By:  Tupaki Desk   |   10 Oct 2020 12:30 PM IST
హైకోర్టుపై యుద్ధాలా? ఏంటీ రాతలు: సజ్జల
X
ఏపీ ప్రభుత్వం తీరుపై ఇటీవల హైకోర్టు చేసిన వ్యాఖ్యలను పలు పత్రికలు తీవ్రంగా రాసిన వైనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై యుద్ధమా? అంటూ ఏంటీ రాతలు అని కొన్ని వార్త పత్రికలపై సజ్జల నిప్పులు చెరిగారు.

ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయని సజ్జల వెల్లడించారు. కావాలంటే తమ తీర్పులపై అప్పీలుకు వెళ్లండని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టు ఆ కథనాల్లో ఉందని సజ్జల తెలిపారు.

ఈ వ్యాఖ్యలు తీర్పుల్లో ఉంటే వారు చెప్పినట్టుగానే అప్పీలుకు వెళ్లి అవి చట్టబద్ధమో కాదో తేల్చమని ఎగువ కోర్టును కోరడానికి అవకాశం ఉంటుందని సజ్జల తెలిపారు.

న్యాయమూర్తుల విచారణ సందర్భంలో అన్నట్టుగా చెబుతున్న మాటలు తీర్పుల్లో లేకపోవడం.. పత్రికలు ఇష్టానుసారంగా కథనాలు అల్లి గందరగోళం చేయడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించేవారిని ఆందోళనకు గురిచేస్తోందని అని సజ్జల విమర్శించారు.

ఇటీవల ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు వ్యతిరేక నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పలు టీడీపీ పత్రికలు దీనిపై తీవ్ర కథనాలు వెలువరించగా.. సజ్జల ఆ పత్రికల కథనాల తీరుపై మండిపడ్డారు.