Begin typing your search above and press return to search.

ఏపీ స‌ర్కారుకు స‌జ్జ‌ల మంట‌!

By:  Tupaki Desk   |   4 Feb 2022 6:42 AM GMT
ఏపీ స‌ర్కారుకు స‌జ్జ‌ల మంట‌!
X
ఏపీ స‌ర్కారుకు కీల‌క స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సెగ త‌గులుతోందా? ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు.. ప్ర‌భు త్వ ప్ర‌క‌ట‌న‌ల్లో ఆయన ప్ర‌మేయంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రి శీల‌కులు. 2019లో జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఏర్ప‌డిన త‌ర్వ‌త‌.. రాజ‌కీయ స‌ల‌హాదారుగా అవ‌తారం ఎత్తిన స‌జ్జ‌ల‌.. కొన్నాళ్ల‌పాటు మౌనంగానే ఉన్నారు. అయితే.. త‌ర్వాత‌.. మాత్రం అన్నీ తానే అయి.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వానికి సంబంధించిన అంశాలైనా.. ప్ర‌తిప‌క్ష నేత‌లు చేసే విమ‌ర్శ‌లైనా.. విష‌యం ఏదైనా కూడా స‌జ్జ‌లే స్పందిస్తున్నారు.

ఇక‌, పోలీసుల‌ను కూడా ఆయ‌నే మేనేజ్ చేస్తున్నార‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో పోలీసులను ఆయ‌న వినియోగిస్తున్నార‌ని.. అప్ర‌క‌టిత హోం మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని. త‌ర‌చుగా టీడీపీ నాయ‌కులు కూడా విమ‌ర్శిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ దుమారం మ‌రింత పెరిగింది. ఉద్యోగుల‌కు ప్ర‌బుత్వానికి మ‌ధ్య త‌లెత్తిన పీఆర్ సీ వివాదంలో స‌జ్జ‌ల‌కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. ప్ర‌బుత్వం త‌ర‌ఫున అన్నీ తానై ఆయ‌న మాట్లాడుతున్నారు. దీనిని ఉద్యోగులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.

ప్ర‌జ‌ల నుంచి ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధుల కంటే ఎక్కువగా స‌జ్జ‌ల వ్య‌వ‌హ‌రిస్తున్నారని.. ఆయ‌న వ‌ల్లే త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ శ్ర‌మ‌ను స‌జ్జ‌ల దోచుకుంటున్నార‌ని, అస‌లు ఆయ‌న‌కు, పీఆర్సీకి సంబంధం ఏంట‌ని ఉద్యోగులు ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేత‌లు రాజ్యాంగేత‌ర శ‌క్తి అయిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం చారిత్ర‌క త‌ప్పిదంగా ఉద్యోగులు అంటున్నారు. త‌మ‌కు స‌ల‌హాదారుల పాల‌న వ‌ద్ద‌ని, తాము ఎన్నుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని వారు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. ప్ర‌భుత్వానికి స‌ల‌హాలివ్వ‌డ‌మే స‌జ్జ‌ల ప‌ని అని, ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి ఆయ‌న‌కు ఎలాంటి హ‌క్కులు ఉన్నాయ‌ని.. ప్ర‌శ్నిస్తున్నార‌రు. త‌మ‌కు హామీలిచ్చిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌కు రావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. గ‌తంలోనూ స‌జ్జ‌ల విష‌యం వివాదానికి దారితీసింది. ఇరు తెలుగు రాష్ట్రాల మ‌ద్య నెల‌కొన్న జ‌ల‌వివాదాల‌పైనా ఆయ‌నే స్పందించారు.. మంత్రులు కూడా ఆయనవ్య‌వ‌హార శైలితో తాము డ‌మ్మీలు అవుతున్నామ‌నే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఎంపీ ర‌ఘురామ ఏకంగా హైకోర్టులో పిటిష‌నే వేశారు. స‌ల‌హాదారుల విధులు ఏంటో నిర్దేశించాల‌ని ఆయ‌న కోర్టును కోరారు. ప్ర‌స్తుతం ఇది విచార‌ణ ద‌శ‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం.