Begin typing your search above and press return to search.
సాగర్ బైపోల్.. అందరికి చావో రేవోనే?
By: Tupaki Desk | 30 March 2021 11:00 PM ISTతెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మరో కురుక్షేత్రాన్ని తలపించేలా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించడం, ఇటు గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అంచనాలకు మించిన విజయం నమోదు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి సాగర్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ సాగర్ ఉప ఎన్నిక మాత్రం వాటికి పూర్తి భిన్నం. దుబ్బాక, గ్రేటర్లో కారుకు బ్రేకులు పడ్డాక జరుగుతోన్న ఉప ఎన్నిక కావడం ఒక ఎత్తు అయితే.. దుబ్బాక, సాగర్ కన్నా భిన్నంగా ఇక్కడ కారు పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండడం కూడా మరో ఆసక్తికరం.
సాగర్ కాంగ్రెస్ పార్టీకి.. ఇంకా చెప్పాలంటే జానారెడ్డికి కంచుకోట. ఇక్కడ గెలుపు ఓటములు కేవలం సాగర్‌కు మాత్రమే కాదు.. యావత్ తెలంగాణపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే కారు పార్టీ ఓ సిట్టింగ్ సీటు కోల్పోయింది. ఇప్పుడు ఈ సీటు కూడా కోల్పోతే పార్టీకి ప్రమాదమే అవుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇప్పటికే నిర్వీర్యం అయిపోతోన్న కాంగ్రెస్ ఉనికి తెలంగాణలో ఉందని చాటి చెప్పాలంటే ఇక్కడ గెలుపు ఆ పార్టీకి అత్యవసరం. పైగా జానారెడ్డికి ఇక్కడ పర్సనల్ ఇమేజ్ ఉండడంతో అది కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
ఇక తెలంగాణలో చాపకింద నీరులా దూసుకుపోతూ దుబ్బాక, గ్రేటర్ విజయాలతో మాంచి జోష్ మీద ఉన్న బీజేపీ ఆ గెలుపులు గాలి వాటం కాదని ఫ్రూవ్ చేసుకోవాలంటే సాగర్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే ఇక్కడ బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. సరైన కేడర్ కూడా లేదు. దక్షిణ తెలంగాణలో పెద్దగా ఆదరణ లేదని ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే పలు సార్లు స్పష్టమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితమే ఇందుకు నిదర్శనం. ఇక బీజేపీది తెలంగాణలో వాపు కాదు.. బలుపు అని ఫ్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలవాలి.. లేదా గట్టి పోటీ అయినా ఇవ్వాలి. లేకపోతే బీజేపీది వాపే అన్నది ఫ్రూవ్ అవుతుంది.
అందుకే బీజేపీ సాగర్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తిని కాకుండా అక్కడ ఎక్కువుగా ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇచ్చింది. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల అభ్యర్థులు మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు. ఏదేమైనా మూడు పార్టీల స్ట్రాటజీలు మామూలుగా లేవు. మరి రేపు సాగర్ సమరంలో అంతిమ విజేత ఎవరు అవుతారో ? చూడాలి.