Begin typing your search above and press return to search.

మేమేమైనా తీవ్రవాదులమా? సాధినేని యామిని ఫైర్

By:  Tupaki Desk   |   18 Sept 2020 3:39 PM IST
మేమేమైనా తీవ్రవాదులమా? సాధినేని యామిని ఫైర్
X
దేవాలయాల పరిరక్షణ పేరిట బీజేపీ చేపట్టిన ‘చలో అమలాపురం’ ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసన తెలిపేందుకు అమలాపురం వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకురాలు సాధినేని యామినిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసుల అరెస్టులపై యామిని తీవ్రంగా స్పందించారు.మేమేమైనా తీవ్రవాదులమా అంటూ సాధినేని పోలీసులను ప్రశ్నించారు. హిందూ దేవాలయాలను అన్యాక్రాంతం చేయడం.. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తదితర చర్యలకు దిగుతున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని యామిని విమర్శించారు.

హిందువులు చేసిన తప్పేంటో చెప్పాలని యామిని అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులకు బాధ్యుడిగా దేవాదాయ శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీ ప్రభుత్వ అసమర్థత వల్లే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని సాధినేని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సహా ఏపీలో వరుసగా దాడులు జరగడానికి కారణమైన దేవాదాయశాఖ మంత్రి తన బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని యామిని విరుచుకుపడ్డారు.