Begin typing your search above and press return to search.

సచిన్ టెండూల్కర్ తనయుడికి నిరాశే... ఐపీఎల్ 2021 వేలం ముందే షాక్!

By:  Tupaki Desk   |   12 Feb 2021 5:00 AM IST
సచిన్ టెండూల్కర్ తనయుడికి నిరాశే... ఐపీఎల్ 2021 వేలం ముందే షాక్!
X
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొనడానికి ముందే యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 18న చెన్నై వేదికగా జరగనున్న మినీ ఐపీఎల్ వేలానికి ఇప్పటికే పేరు నమోదు చేసుకున్న అర్జున్.. విజయ్‌ హజారే వన్డే ట్రోఫీలో పాల్గొనే ముంబై సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాల్సిన ముంబై సీనియర్ జట్టులో అతడ్ని ఎంపిక చేయలేదు. ఫిబ్రవరి 20న విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ముంబై సీనియర్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక చేశారు. కానీ ఇందులో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ 2021 వేలం లో ఇది అర్జున్‌పై ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

య్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ కోసం తొలిసారి ముంబై సీనియర్‌ జట్టుకు ఎంపికైన అర్జున్‌.. ఆ టోర్నీలో రాణించలేకపోయాడు. ఆడే అవకాశం వచ్చిన ఒక్క మ్యాచ్‌లోనూ రెండు ఓవర్లు వేసిన అతను 21 పరుగులు ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లోనూ మెప్పించలేకపోయాడు. దాంతో విజయ్‌ హజారే ట్రోఫీ జట్టు నుంచి అతన్ని తప్పించారు. ఫామ్ లేని కారణంగా ఎక్కువ అవకాశాలు సైతం దక్కించుకోలేకపోయాడు అర్జున్ టెండూల్కర్.