Begin typing your search above and press return to search.

మన్ కీ బాత్ లో ఆ ఇద్దరు ఎందుకు?

By:  Tupaki Desk   |   28 Feb 2016 2:31 PM IST
మన్ కీ బాత్ లో ఆ ఇద్దరు ఎందుకు?
X
ప్రధాని నరేంద్రమోడీకి ఉన్న ఛరిష్మా సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పట్ల జనం పెట్టుకున్న ఆశలు తీరకపోయినా కూడా ఇంతవరకు ఆయన ఛరిష్మా మాత్రం తగ్గలేదు. ఇప్పుడు తన సొంత ఛరిష్మా ప్రభావం కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని మోడీ అనుకుంటున్నారట. అందుకే ఈసారి మన్ కీ బాత్ లో తాను ఒక్కడినే కాకుండా దేశంలో తిరుగులేని ఇమేజి ఉన్న మరో ఇద్దరిని తనతో పాటు కూర్చోబెడుతున్నారని టాక్.

ఆదివారం నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రజలతో తన మనోభావాలను పంచుకోనున్నారు మోడీ. అయితే ఈసారి ఆయనతో పాటు ఇద్దరు ప్రసిద్ధ క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మోడీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన 17వ సారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఈసారి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ - చెస్ రారాజు విశ్వనాధన్ ఆనంద్ లు పాల్గొంటున్నారు.

దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మోడీ హవా తగ్గడంతో సచిన్, ఆనంద్ లను తెస్తున్నారని అంటున్నారు. అయితే... బీజేపీ వర్గాలు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నాయి. మోడీ ఇమేజికి ఎలాంటి ఢోకా లేదని... కేవలం ఈ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాలన్న ఉద్దేశంతో వారిని తీసుకొస్తున్నారని అంటున్నాయి.