Begin typing your search above and press return to search.

సచిన్ ప్రశ్న.. చెమట పట్టకపోతే ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   10 Jun 2020 10:00 PM IST
సచిన్ ప్రశ్న.. చెమట పట్టకపోతే ఏం చేస్తారు?
X
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో క్రికెట్ లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విధించిన నిషేధాలపై భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఉమ్మిని బంతిపై రుద్దడం నిషేధించడం సరే.. కానీ దానికి బదులుగా చెమటను వాడవచ్చంటూ వస్తున్న సూచనలపై సచిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

వేడిదేశమైన ఇండియాలో చెమట వస్తుందని.. శీతల దేశాలపై ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి చల్లని ప్రదేశాల్లో చమట అంత సులభంగా రాదని.. అప్పుడు ఏం చేయాలని సచిన్ తాజాగా ఐసీసీని ప్రశ్నించాడు.

ఉమ్మి నిషేధంతో బౌలర్లు ఎదుర్కొనే కష్టాలను సచిన్ ఈ సందర్భంగా వివరించాడు. బంతికి మెరుపు తేవడానికి బౌలర్లు ఉమ్మిని వాడుతారని.. కరోనా వైరస్ నేపథ్యంలో దాన్ని వాడవద్దనడం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. శీతల ప్రదేశాల్లో ఆడితే చెమట రాదని.. దాంతో బంతిని ఎలా రుద్దగలరని.. రివర్స్ స్వింగ్ చేసేందుకు బౌలర్లకు తిప్పలు తప్పవని సచిన్ అన్నారు.

తాజాగా కరోనా పరిస్థితుల్లో బంతిని ఉమ్మితో మార్చడం సాధ్యం కాదు కాబట్టి 50-55 ఓవర్లకే కొత్తబంతిని తీసుకురావాలని సచిన్ టెండూల్కర్ తాజాగా ఐసీసీకి సూచించాడు.