Begin typing your search above and press return to search.

డ్రామా క్లోజ్..టెన్షన్ తగ్గి..నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు

By:  Tupaki Desk   |   14 Aug 2020 6:15 AM GMT
డ్రామా క్లోజ్..టెన్షన్ తగ్గి..నవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు
X
గురి పెట్టామంటే చాలు.. లక్ష్యాన్ని ఛేదించాలన్నట్లుగా ఉంటుందని చెబుతారు మోడీషా మంత్రాంగం. ఇప్పటికే కర్ణాటక.. మధ్యప్రదేశ్ లలో తాము అనుకున్నట్లుగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయటంలో విజయవంతమైన కమలనాథులు.. తెర వెనకు నిలిచిన రాజస్థాన్ పీఠాన్ని కాంగ్రెస్ నుంచి చేజారేలా ప్లాన్ చేస్తున్నట్లుగా వాదనలు వినిపించాయి. ఇందులో భాగంగా తిరుగుబాటు నాయకుడిగా సచిన్ పైలెట్ తెర మీదకు రావటంతో పాటు.. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దీంతో.. రాజస్థాన్ సర్కారుకు నూకలు చెల్లినట్లే భావించారు. ఇందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తాన్ని రాజస్థాన్ లో సర్కారును నిలుపుకోవటంలో కాంగ్రెస్ అధినాయకత్వం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇందుకోసం సుదీర్ఘంగా రాయబారాలు సాగాయి. ఎక్కడెక్కడి వారినో రంగంలోకి దించిన తర్వాతే.. రాజస్థాన ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. తల ఎగురవేసిన సచిన్ ను వెనక్కి తీసుకురావటంలో ప్రియాంక గాంధీతో పాటు.. ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సైతం కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు.

ఒకరిపై ఒకరు నిందలు.. విమర్శలు సంధించుకోవటంతో పాటు ఎత్తులు పైఎత్తులు వేసుకున్నారు. చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని సచిన్ నిర్ణియించుకోవటం ద్వారా రాజస్థాన్ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చినట్లైంది. దీనికి తగ్గట్లే.. రాష్ట్ర సీఎం గహ్లాత్ నివాసానికి వెళ్లిన సచిన్ పైలెట్.. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో.. కొన్ని వారాలుగా సాగుతున్న అసమ్మతి సమిసిపోయినట్లైంది. కాలం కలిసి వస్తే ఎలా ఉంటుందన్న విషయం తాజాగా గెహ్లాత్ కు మరింత బాగా అర్థమయ్యే పరిణామం మరొకటి చోటు చేసుకుంది.

బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యే విలీన అంశం మీద కూడా ఇప్పటికిప్పుడు తాము ఎలాంటి జోక్యం చేసుకోమని సుప్రీం తెల్చి చెప్పటంతో.. కాస్తంత ఉపశమనంగా చెప్పాలి. ఇక.. అసెంబ్లీలో బలనిరూపణ ఒక్కటి పూర్తి అయితే.. గెహ్లాత్ కు తిరుగు ఉండదనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెహ్లాత్ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లుగా బీజేపీ ప్రకటించింది. సచిన తోడున్న నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వానికి బలపరీక్ష నల్లేరు మీద నడకలా ఉంటుందని చెబుతున్నారు.