Begin typing your search above and press return to search.

అప్పట్లో ఆకతాయిలు అల్లరి చేస్తే సబిత ఏం చేసేవారంటే?

By:  Tupaki Desk   |   25 Oct 2019 10:15 AM IST
అప్పట్లో ఆకతాయిలు అల్లరి చేస్తే సబిత ఏం చేసేవారంటే?
X
ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా.. కనుచూపుతో శాసించే అధికారం చేతిలో ఉన్న సబిత ఒక్కసారి గతంలోకి వెళ్లారు. ఇప్పుడంటే అత్యున్నత స్థానంలో ఉన్న సబిత గంభీరంగా ఉండటమే కాదు.. తేడా వస్తే తాట తీస్తారన్న పేరుంది. మరి.. అలాంటి ఆమె చదువుకునే రోజుల్లో ఎలా ఉండేవారు? ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? లాంటి ఆసక్తికర అంశాల్ని ఆమె చెప్పుకొచ్చారు.

తాము చదువుకునే రోజుల్లో ఆకతాయిలు అల్లరి చేస్తుంటే.. ఆ విషయాన్ని ఇంట్లో చెబితే.. ఎవరిని పట్టించుకోకుండా తల కిందకు దించుకొని వెళ్లాలని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు.. ఒకవేళ అలా సాధ్యం కాకుంటే చదువు మానేయాలని చెప్పేవారన్న విషయాన్ని మంత్రి సబితా వెల్లడించారు.

ఇంతకీ ఈ మాటలన్ని ఆమె ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఐదో వార్షికోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. సబిత నోటి నుంచి వచ్చిన మాటలు వింటే.. గతంలో ఇళ్లల్లో మహిళల పరిస్థితి ఎలా ఉండేదన్న విషయంతో పాటు.. మారిన కాలం ఎలా ఉందన్నది ఆమె మాటలు స్పష్టం చేస్తాయని చెప్పాలి