Begin typing your search above and press return to search.
ఎన్నాళ్లకు ఆంధ్రాలో ఒక మగాడు కనిపించాడు!
By: Tupaki Desk | 15 Feb 2021 5:05 PM ISTమొండోడు రాజు కంటే బలవంతుడనే సామెత.. ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తోంది. ఎందుకంటే.. మొండోళ్లే పాలకులుగా మారుతున్న వేళలో ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. వారు ఏమైనా అనుకుంటే జరిగి తీరాల్సిందే అన్నట్లుగా పాలకుల తీరు మారుతోంది. ప్రధాని మోడీనే తీసుకోండి. ఆయన చెప్పే మాటల్ని వింటే.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి దొరికాడన్న భావన కలుగుతుంది. అలా అనుకున్నంతనే.. పెట్రోల్.. డీజిల్ ధరలు గుర్తుకు వచ్చినా.. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తిన రైతుల విషయంలో ఆయన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం గుర్తుకు వచ్చినా.. అప్పటివరకు ఉన్న ఫీలింగ్ ఒక్కసారిగా మాయమయ్యే పరిస్థితి.
మోడీ లాంటి నేత ప్రధానిగా ఉన్న కాలంలో ఎల్ఐసీ.. భారతీయ రైల్వేలతో పాటు.. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు కట్టబెడతానన్న నిర్ణయం తీసుకోవటమా? సమర్థుడైన మోడీ లాంటి పాలకుడు ఉన్నప్పుడు.. గాడి తప్పిన ఈ కంపెనీలన్ని గాడిలో పడాలి కానీ.. మా వల్ల కాదు.. మేం వదిలించుకుంటామనుకోవటం ఏమిటి? అసలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్న. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామన్న నిర్ణయంపై నిరసన వ్యక్తమవుతున్నా.. ఆంధ్రోళ్లలో మాత్రం చురుకు పుట్టటం లేదు. ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విశాఖ.. చుట్టుపక్కల ప్రాంతాల వారి నిరసనే కానీ.. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు పెద్దగా జరగని పరిస్థితి.
ఇదిలా ఉంటే.. ఆంధ్రుల హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటికే సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ పెద్ద ఎత్తున మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దానికి అంతగా ప్రాచుర్యం లభించని పరిస్థితి .ఇలాంటివేళ.. సీనియర్ నేత.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సబ్బంహరి నోటి నుంచి తాజాగా ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది.
తాజాగా పల్లా దీక్షస్థలికి వెళ్లిన సబ్బం హరి.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్టీల్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న చీకటి ఒప్పందాల్ని బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆయన.. అసలు విషయాల్ని వెల్లడించాలన్నారు. పల్లా కోసమే తాను వచ్చానని.. ఆయనతోకలిసి పని చేస్తానని చెప్పారు. ఆయన ఆశయం కోసం.. ఆయన తర్వాత దీక్షలో కూర్చుంటానని ఉద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇలానే ఉంటే.. ఉద్యమం ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు.
పల్లా శ్రీనుకు ఆరోగ్యం బాగాలేదని.. ఇప్పుడున్నపరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ తో పాటు.. శ్రీనివాస్ ను రక్షించుకోవాలన్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలు ఎవరూ ఇప్పటివరకు ఈ అంశంపై సీరియస్ గా నిర్ణయాన్ని తీసుకోని వేళ.. సబ్బం రంగంలోకి దిగి.. ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పటం కాదు.. చేతల్లో చూపిస్తే.. ఆడు మగడ్రా బుజ్జి అన్న మాటకు నిలువెత్తు రూపంలా నిలుస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. సబ్బం తాను చెప్పినట్లే చేస్తారా? అన్నది చూడాలి.