Begin typing your search above and press return to search.

శబరిమల తీర్పు: వాయిదా కు కారణమిదే.?

By:  Tupaki Desk   |   14 Nov 2019 7:49 AM GMT
శబరిమల తీర్పు: వాయిదా కు కారణమిదే.?
X
కేరళ లోని పవిత్రమైన శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశం పై సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు. ఈ తీర్పుపై రివ్యూ పిటీషన్ ను న్యాయస్థానం పెండింగ్ లో పెట్టింది. ఈ కేసు లో తీర్పు ను ఇవ్వడానికి రెడీ అయిన సుప్రీం కోర్టు రెండు గా చీలి పోయింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యం లోని ఐదుగురు న్యాయమూర్తు ల బృందం లో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో తీర్పును విస్తృత ధర్మాసనానికి (ఏడుగురు న్యాయమూర్తు ల బృందానికి) బదిలీ చేస్తూ పెండింగ్ లో పెట్టారు.

*3-2 ఓటింగ్ తో ఎటూ తేలని శబరిమల వివాదం
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా పవిత్ర శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించారు. ఇక మిగతా ఇద్దరు న్యాయ మూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ నారీమన్ లు మహిళల కు ప్రవేశాన్ని కల్పించాలని అభిప్రాయ పడ్డారు. దీంతో తుదీ తీర్పును సుప్రీం కోర్టు పెండింగ్ లో పెట్టింది. ఏడుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం ముందుకు పంపింది.

* అసలు శబరిమల వివాదం ఇదీ..
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని హిందువులు వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప భక్తులంతా భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ దేవాలయం లో నెలసరి కలిగే మహిళల ప్రవేశాన్ని పరమ పాపంగా భావిస్తారు. అయితే సుప్రీం కోర్టు మహిళల ప్రవేశానికి అనుమతి ఇవ్వడం తో దేశం లో వివాదం ముదిరింది. కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం మహిళల ను అయ్యప్ప ఆలయం లోకి పంపి వివాదాన్ని రాజేయగా.. కేంద్రంలో బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. కేరళ లో పోరాడింది. హిందువుల మత విశ్వాసాలకు వ్యతిరేకం గా సాగుతున్న ఈ వివాదం సుప్రీం కోర్టు కు చేరడం తో మహిళల కు శబరిమల లోకి అనుమతిని ఇస్తూ తీర్పు ను ఇచ్చింది. అయితే తాజా రివ్యూ పిటీషన్ లో మహిళల ప్రవేశం పై జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరక తీర్పు వాయిదా పడింది.

* హిందువులే కాదు.. ముస్లింలు, పార్శీల ను లాగారు..
శబరిమల ఆలయం లోకి మహిళల ప్రవేశం ఇతర మతాల్లోకి కూడా పాకింది. సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పులో మహిళల కు సమాన హక్కులు, సమాన హోదా కేవలం హిందూ మతంలోనే కాకుండా ముస్లిం, పార్శి మతాల్లో కి కూడా రావాలని.. అందుకే మసీదులు, పార్శి ప్రార్థన స్థలాల్లోకి కూడా మహిళల ప్రవేశం పై వారి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును అన్ని మతాలకు లింక్ పెట్టారు. అందుకే తీర్పు ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో శబరిమల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ పిటీషన్ లోకి ముస్లింలు, పార్శిల సంఘాలను కూడా ఇంప్లీడ్ చేశారు. శబరిమల లో మహిళల కు ప్రవేశం కల్పిస్తే ముస్లిం మసీదులు, పార్శిల ప్రార్థనా మందిరాల్లోకి కూడా ఇదే సంప్రదాయం వర్తిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

*అంతిమ తీర్పు పై ఉత్కంఠ
ఏడుగురు న్యాయ మూర్తుల ధర్మాసనం చెంతకు ఈ శబరిమల వివాదం చేరింది. దీంతో శబరిమలలో మహిళల ప్రవేశానికి అనుమతి దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠ గా మారింది. ప్రస్తుతాని కి ఐదుగురు సభ్యుల్లో 3-2 మెజార్టీ ప్రకారం మహిళలకు శబరిమల లో ప్రవేశాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పుపైనే మహిళల ప్రవేశం ఆధారపడి ఉంటుంది.