Begin typing your search above and press return to search.

66 వేల‌కే అద్భుత‌మైన ఇళ్లు

By:  Tupaki Desk   |   9 Nov 2015 10:30 PM GMT
66 వేల‌కే  అద్భుత‌మైన ఇళ్లు
X
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇళ్లంటే...అబ్బో ఎన్ని చిక్కుల్లో భూమి/ఫ‌్లాట్‌ కొనుగోలు చేసింది మొద‌లు గృహ‌ప్ర‌వేశం పూర్త‌య్యేవ‌ర‌కు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌నంత బిజీ ఉంటుంది. స్థ‌లం అయితే ఎన్నో చిక్కులు చెక్ చేసుకోవాలి. అది పూర్త‌యి మ‌న‌మే ఇళ్లు నిర్మించుకుంటే భ‌విష్య‌త్‌ ను దృష్టిలో పెట్టుకొని అన్ని ప‌నులు చ‌క్క‌బెట్టుకోవాలి. ఫ్లాట్ అయితే.... బిల్డ‌ర్ నాణ్య‌త సంగ‌తి ఏంటో అనే ఆలోచ‌న ఒక‌వైపు...చెప్పిన స‌మ‌యానికి అంద‌జేస్తాడా అనే అనుమానం మ‌రోవైపు! స‌మ‌స్య‌ల ధ‌రువుతో పాటు ఇసుక - సిమెంటు - కంక‌ర వంటి ముడిస‌రుకుల‌ ధ‌ర‌ల బ‌రువు కూడా ఉండ‌నే ఉంది. వీట‌న్నింటికీ చెక్ పెట్టి త‌క్కువ ఖ‌ర్చుతో...నాణ్య‌మైన ఇళ్లు వ‌స్తే... ఆ చాన్స్ ఉందా అని సందేహామా? ఈ వార్త చ‌ద‌వండి విష‌యం ఏంటో మీకే తెలిసిపోతుంది.

టెక్నాల‌జీ పరిష్క‌రించ‌లేని స‌మ‌స్య అంటూ లేన‌ప్ప‌టికీ ఇంటి నిర్మాణం విష‌యంలో ఇప్ప‌టికీ ఆ లోటు ఉంది. దాన్ని తీర్చేవిధంగా వియ‌త్నం ప‌రిశోధ‌కులు సక‌్సెస్ అయ్యారు. ఎస్ హౌస్ పేరుతో వెలుగులోకి తీసుకువ‌చ్చిన ఈ ఆవిష్క‌ర‌ణ‌లో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఇళ్లు మూడు గంట‌ల్లో పూర్త‌వుతుంది. అదేంటి ఇంత తొంద‌ర‌గా అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కావ‌చ్చేమో అనుకుంటున్నారా? దాదాపుగా అలాంటిదే. కాంక్రీట్ ఫౌండేషన్ - ఉడెన్ ఫ్లోర్ - స్టీల్ ఫ్రేమ్ - స్టీల్ షీట్ రూఫ్ - స్టీల్ డ్రైనేజ్‌ గటర్... ఇవే ఈ ఇంటి స‌రంజామా. ముందుగా వీటిని వేరువేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చుకుంటే చాలు ఎస్ హౌస్ ఇంటి నిర్మాణం పూర్తి అయిపోతుంది.

మ‌రి నాణ్య‌త సంగ‌తి అంటారా....దానికీ టెక్నాల‌జీతోనే ప‌రిష్కారం క‌నిపెట్టారు. పొరుగుదేశాల్లో తుపానులు స‌హ‌జం. అలాంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం డిజైన్ చేశారు. ఎస్ హౌస్ నిర్మానాణికి ఉప‌యోగించిన విశిష్ట‌మైన టెక్నాల‌జీ ద్వారా ఈ ఇంటికి ఉప‌యోగించిన చెక్క‌కు చెద‌లు ప‌ట్టే అవ‌కాశ‌మే లేదంట‌. ఇనుముకు తుప్పు ప‌ట్ట‌డం కూడా ఉండ‌ద‌ని డిజైన‌ర్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇంతే కాదు..ముప్పై సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఇంత‌కీ మార్కెట్‌ లో ఉందా అనేదే సందేహం క‌దా....ఈ డిజైన్‌ ను తీసుకువ‌చ్చింది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశాల్లోని పేదల కోసం. నాలుగేళ్ల క్రితం ఎస్ హౌస్ ప్లాన్‌ ను సిద్ధం చేసుకోగా ప్ర‌స్తుతం డిజైన్ పూర్తయి మొద‌టి నిర్మాణం వియాత్నంలో ప్ర‌ద‌ర్శించారు. దీన్ని పెద్ద ఎత్తున త్వ‌ర‌లోనే మార్కెట్‌ లోకి తీసుకువ‌చ్చేందుకు డిజైన‌ర్లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.