Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ డేటా హ్యాకింగ్ ..అబద్దం అంటున్న రష్యా !
By: Tupaki Desk | 20 July 2020 1:22 PM ISTకరోనా వైరస్ ..కరోనా వైరస్ ..ప్రపంచం మొత్తం ఈ కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే , కరోనా వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా కూడా కరోనా ను అరికట్టే సరైన వ్యాక్సిన్ ఇంకా కనిపెట్ట లేకపోతున్నారు. కరోనా మహమ్మారిని అంతమొందించే సరైన వ్యాక్సిన్ కోసం అమెరికా, బ్రిటన్, రష్యా , భారత్ లకు చెందిన పలు ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా రక్కసి నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గం.
ఈ ప్రయోగంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందినవ్యాక్సిన్ .. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకుంది. ఇక అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్ కూడా కీలకమైన థర్డ్ స్టేజ్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కు ఈ నెల 27వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే రష్యా కూడా ముందడుగులోనే ఉంది. సెషనోవ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ ఆగస్ట్ రెండో వారంలో అందుబాటులోకి వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే.. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన ఘనత రష్యాకే చెందుతుంది. అయితే ఈ క్రమంలో రష్యాపై యూకే, యూఎస్, కెనెడాలు సంచలన ఆరోపణలు చేశాయి. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన డేటాను హ్యాకింగ్ చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రష్యా ప్రభుత్వ మద్దతుతోనే హ్యాకర్లు ఈ ప్రయత్నాలకు ఒడిగట్టారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బ్రిటన్ భద్రతా మంత్రి జేమ్స్ బ్రోకెన్ షైర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్ కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్ సీఎస్ సీ) ఓ ప్రకటనలో ఈ హ్యాకింగ్ వివరాలు వెల్లడించింది. రష్యా ప్రభుత్వ ప్రోద్బలిత హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డేటాతో పాటు చికిత్స విధానాలపై జరుగుతున్న పరిశోధనల సమాచారాన్ని కూడా దొంగిలించేందుకు ప్రయత్నించారని తెలిపింది. రష్యాకు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్‌లో ఓ భాగమైన ఏపీటీ-29 లేదా కోజీ బేర్ అనే హ్యాకింగ్ గ్రూపు.. ఫార్మాసుటికల్ రీసెర్చ్ సంస్థల సమాచారన్ని హ్యాక్ చేశాయంటూ ఆ మూడు దేశాలు మండిపడ్డాయి.
అయితే.. బ్రిటన్,యూఎస్, కెనెడాలు చేసిన ఆ ఆరోపణలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కానీ.. తమ ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ కానీ ఎలాంటి హ్యాకింగ్ చేయలేదని.. ఇవన్నీ నిరాధార ఆరోపణలంటూ రష్యన్ ప్రతినిధి ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే , హ్యాకింగ్ జరిగింది అని ఆరోపణలు చేసిన బ్రిటన్, యూఎస్,కెనెడాలు ఏం డాటాను హ్యాక్ చేశారన్నది కానీ.. ఇతర వివరాలను కానీ తెలుపలేదు.