Begin typing your search above and press return to search.

#RussiaUkrainewar: యుద్ధ సమయాల్లో రష్యన్ సైనికుల సరసాలు

By:  Tupaki Desk   |   24 Feb 2022 12:44 PM GMT
#RussiaUkrainewar: యుద్ధ సమయాల్లో రష్యన్ సైనికుల సరసాలు
X
ఓ పక్క ఉక్రెయిన్ పై భీకర యుద్ధం చేస్తూనే రష్యన్ సైనికులు సరసాలు చేస్తున్నారు. ఉక్రెయిన్ మహిళలకు రష్యన్ సైనికులు పంపుతోన్న రోమాంటిక్ మెసేజ్ లు వైరల్ గా మారాయి. ఇంతటి యుద్ధ సమయంలో వారు మహిళలకు అసభ్యకరమైన సందేశాలు పంపడం వైరల్ అవుతోంది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను రష్యా టార్గెట్ చేసింది. రాజధాని కీవ్ తోపాటు 11 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ తోపాటు దేశంలోని 6 ప్రధాన ఎయిర్ పోర్ట్స్ ను రష్యా టార్గెట్ చేసింది.

రష్యా ప్రధాన టార్గెట్ గా ఆర్టిలరీ పార్క్ ఉంది. అమెరికాకు పెంటగాన్ మాదిరిగా.. ఉక్రెయిన్ ఆయుధగారం ఇక్కడే ఉంది. ఈ ఆర్టిలరీ పార్క్ పై దాడి చేయడమే లక్ష్యంగా రష్యన్ బలగాలు ముందుకు కదులుతున్నాయి.

కేవలం ఐదే ఐదు గంటల్లో సగం ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుంది రష్యా. మిలటరీ ఆపరేషన్ మొదలుపెట్టిన ఐదారు గంటల్లోనే సగం ప్రాంతాన్ని తన ఆధీనంలోకి రష్యా తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు ఖార్కివ్, ఒడెస్సా, జాపోరియాజియా, దీప్పర్, లుహాన్స్ , డొనెట్స్ ను ఆధీనంలోకి తీసుకుంది.

మిగతా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు బాంబుల మోత మోగిస్తోంది. ఉక్రెయిన్ లోని 11 ప్రధాన ప్రాంతాల్లో రష్యా ఈ దాడి చేస్తోంది.ఇక రాజధాని కీవ్ లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది.

రష్యన్ సైన్యం ఉక్రెయిన్ లోని రెండో అతిపెద్ద నగరం ఖార్కివ్ నుంచి కేవలం 20 మైళ్ల దూరంలో ఉంది. ఇంతలో రష్యా సైనికులు తనకు సందేశాలు పంపుతున్నారని ఉక్రెయిన్ మహిళ స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. అనేక మంది రష్యన్ సైనికులు తమ ఫొటోలతోపాటు తమ స్థానాల సమాచారాన్ని మహిళలకు పంపినట్లు తెలిపింది.

ది సన్ నివేదిక ప్రకారం.. ఆండ్రీ , అలెగ్జాండర్, గ్రెగొరీ, మైఖేల్ తో సహా అనేక మంది రష్యన్ సైనికులు ఉక్రేనియన్ మహిళలను ఆకర్షించడానికి డేటింగ్ యాప్ లో తమ ప్రొఫైల్ లను సృష్టించారు.

గత కొన్ని రోజులుగా టిండెర్ లో పలువురు రష్యా సైనికులు తనకు మెసేజ్ లు, అభ్యర్థనలు పంపుతున్నారని 'దశా సినెల్నికోవా' అనే ఉక్రెయిన్ మహిళ తెలిపింది. 'నేను ఉక్రెయిన్ లోని కైవ్ లో నివసిస్తున్నానని.. చాలా మంది రష్యన్ సైనికులు టిండెర్ కు చేరుకున్నారని.. దీంతో నా లోకేషన్ సెట్టింగ్ ను ఖార్కివ్ కు మార్చానని.. అక్కడ కూడా నాకు మెసేజ్ లు వస్తున్నాయని దశా వాపోయింది.

ఓ రష్యాన్ సైనికుడు చారల చొక్కాలో కనిపించాడని..మరో వ్యక్తి తన పిస్టల్ తో మంచం మీద పడుకున్నాడని.. నేను శత్రువుతో మాట్లాడడం గురించి ఎప్పుడూ ఆలోచించనని దశా పేర్కొంది. నేను టిండెర్ లో వారి అభ్యర్థనను తిరస్కరించానని.. కానీ చాలా మంది వ్యక్తులు నిరంతరం సందేశాలను పంపుతున్నారని రష్యన్ సైనికుల గుట్టు రట్టు చేసింది.