Begin typing your search above and press return to search.

రష్యాతో మిస్సైల్ డీల్..అమెరికా సీరియస్

By:  Tupaki Desk   |   4 Oct 2018 4:51 PM IST
రష్యాతో మిస్సైల్ డీల్..అమెరికా సీరియస్
X
భారత్-రష్యా మధ్య బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందానికి అడుగులు పడ్డాయి. భారత్ పర్యటనకు గురువారం వస్తున్న రష్యా అధ్యక్షుడితో మోడీ సమావేశం కానున్నారు.ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం కొనసాగనున్నాయి.

భారత్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు రష్యా సాయం కోరుతోంది. ఇందులో భాగంగానే ఇదివరకే రష్యా వెళ్లిన ప్రధాని మోడీ భారీ క్షిపణులు - నౌకల కొనుగోలుకు ఆసక్తి కనబరిచారు. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ వస్తున్నారు.భారత్-రష్యాల మధ్య 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదరబోతోంది. ఇందులో ఎస్-400 క్షిపణుల కొనుగోలుతో పాటు నాలుగు క్రివాక్ యుద్ధనౌకలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.

ప్రపంచంలోనే పవర్ ఫుల్ వెపన్ అయిన ఎస్400 మిస్సైల్స్ ను సొంతం చేసుకోవాలని భారత్ అడుగులు వేస్తోంది. చైనా, పాకిస్తాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్ ఈ ఎస్400 క్షిపణులను రష్యా నుంచి కొనేందుకు ఒప్పందం చేసుకుంటోంది. ఇదే క్షిపణిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు చైనా ప్రయత్నించగా.. అమెరికి డ్రాగన్ దేశంపై కూడా ఆంక్షలు విధించింది. ఇప్పుడు భారత్ విషయంలోనే అమెరికా అదే వైఖరి అవలంభిస్తోంది.

రష్యా నుంచి ఎస్400 సర్ ఫేస్ టు ఎయిర్ మిస్సెల్ కొనుగోలు కొంటే ఆంక్షలు విధిస్తామని తాజాగా అమెరికా తేల్చిచెప్పింది. కానీ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారత్ పర్యటనకు వస్తున్న రష్యా అధ్యక్షుడితో ఒప్పందం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. ఒకవేళ భారత్ గనుక ఆ క్షిపణులను కొనుగోలు చేస్తే అమెరికా చట్టాల ప్రకారం భారత్ పై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.