Begin typing your search above and press return to search.

పెద్దన్న నెట్ వర్కుల్ని కంట్రోల్ తెచ్చుకునే భారీ కుట్ర?

By:  Tupaki Desk   |   15 Dec 2020 3:00 PM IST
పెద్దన్న నెట్ వర్కుల్ని కంట్రోల్ తెచ్చుకునే భారీ కుట్ర?
X
సంచలన అంశం ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచానికి పెద్దన్నగా అభివర్ణించే అమెరికాలోని ప్రభుత్వ వ్యవస్థల్లో భారీ హ్యాకింగ్ కుట్ర జరిగిందా? అంటే అవునన్న మాట బలంగా వినిపిస్తోంది. దేశంలోని వివిధ శాఖల్లో సైబర్ నేరగాళ్లు భారీ మాల్ వేర్ తో దాడులు చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవల ఫైర్ ఐ అనే సైబర్ భద్రతా సంస్థ నెట్ వర్కు హ్యాకింగ్ కు గురైనప్పుడు.. ఈ కొత్త విషయం బయటకు వచ్చింది.

ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్ల నైపుణ్యాన్ని గుర్తించిన విశ్లేషకులు.. ఇదంతా రష్యా చేసిన పనేనని అనుమానిస్తున్నారు. దీంతో.. తమ నెట్ వర్కుల్ని మరోసారి చెక్ చేస్తుననారు. ఎక్కడైనా ముప్పు తలెత్తినట్లుగా తేలితే..సదరు సర్వర్లను డిస్ కనెక్టు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. ట్రెజరీ.. వాణిజ్య శాఖల నెట్ వర్కులు హ్యాకింగ్కు గురైనట్లుగా తేలిన నేపథ్యంలో.. కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ ఏడాది మధ్య నుంచి భారీ స్థాయిలో అమెరికా కార్యనిర్వాహక విభాగాల్లోకి సైబర్ చొరబాట్లు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అతి పెద్ద గూఢచర్య ఆపరేషన్ లో భాగంగా సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి ఉంటారని అనుమానిస్తున్నారు. దీని వెనుక రష్యా హస్తం ఉందన్నది ఇప్పుడు చర్చగా మారింది. అయితే.. ఈ ఆరోపణకు సంబంధించి ఆధారాలు పెద్దగా లేవంటున్నారు. ఈ తరహా సైబర్ దాడి అమెరికాకు మాత్రమే పరిమితం కాదని.. పలు దేశాలతో పాటు మరిన్ని సంస్థల నెట్ వర్కులపైనా జరిగి ఉంటుందని చెబుతున్నారు.