Begin typing your search above and press return to search.
చెట్టు దగ్గర ఆ జంట న్యూడ్ షూట్.. ఆ దేశం ఏం చేసిందంటే?
By: Tupaki Desk | 8 May 2022 8:50 AM ISTమనం ఎక్కడికి వెళితే.. అక్కడి సంప్రదాయాల్ని గౌరవిస్తూ.. వారి మనోభావాలు గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ.. కొంతమంది అందుకు భిన్నంగా ప్రదేశం ఏదైనా.. తమ పిచ్చను రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారి విషయంలో కొన్ని దేశాలు కఠినంగా స్పందిస్తే.. మరికొన్ని దేశాలు మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం.. మొదటి కోవకు చెందింది.తమ మనోభావాల్ని దెబ్బ తీసే వారి విషయంలో ఇండోనేషియా ఎంత కచ్ఛితంగా.. కఠినంగా ఉంటుందో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి.
దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక చెట్టును ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని టబనన్ ప్రజలు చాలా పవిత్రంగా కొలుస్తుంటారు. అలాంటి చెట్టు వద్దకు వెళ్లిన ఒక రష్యా జంట అత్యుత్సాహంతో అక్కడి వారి మనోభావాల్ని పట్టించుకోకుండా నగ్నంగా ఫోటో షూట్ చేశారు.
శతాబ్దాల వయసున్న మర్రి చెట్టు వద్ద నగ్న షూట్ ను అలినా ఫజ్లీవా అనే ఇన్ స్టా మోడల్ చేసింది. ఆమె భర్త ఆమె ఫోటోల్ని తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. బాలినీస్ హిందూ వర్గాల వారికి వీరి వ్యవహారం చిర్రెత్తుకొచ్చింది. వారి వరకు వారు.. పర్వతాలు.. చెట్లు.. సహజ వనరులను పరమ పవిత్రంగా చూడటంతో పాటు.. వాటిని సంరక్షించుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.
న్యూడ్ ఫోటో షూట్ మీద నిరసన వ్యక్తం కావటంతో.. ఆ రష్యా జంటనుఅదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారికి రెండు శిక్షలు విధించారు. అందులో మొదటిది ఆర్నెల్ల పాటు తమ దేశంలో అడుగు పెట్టకుండా ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో.. దేశాన్ని విడిచి పెట్టి వెళ్లే సమయంలో ఆ జంట ఆ పురాతన మర్రి చెట్టు దగ్గర వాళ్ల చేతనే శుభ్రం చేయించారు. తాము చేసిన తప్పుడు పనికి క్షమాపణలు చెబుతూ.. ఇన్ స్టాలో సందేశాన్ని ఉంచుతూ వీడియోను విడుదల చేశారు. ఇదంతా చదివినప్పుడు మన దగ్గరి పవిత్ర స్థలాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. మనం మాత్రం అన్ని మూసుకొని ఉంటామే తప్పించి.. గళం విప్పి మాట్లాడటం మాత్రం ఉండదు.