Begin typing your search above and press return to search.

వీళ్లు మనుషుల మాంసాన్ని తిన్నారు.. ఎంత మందిని చంపారంటే?

By:  Tupaki Desk   |   30 Sept 2021 5:00 AM IST
వీళ్లు మనుషుల మాంసాన్ని తిన్నారు.. ఎంత మందిని చంపారంటే?
X
సాధారణంగా మానవులు ఇతర జంతువుల మాంసాన్ని తినడం సహజమే. కానీ, మనుషుల మంసం తినడం ఆటవికం. క్రూర జంతువులు మాత్రమే మనుషులను చంపి వాటి మాంసాన్ని తింటాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ, మనుషులు కూడా మనుషుల మంసాన్ని తింటారనే విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపడుతారు కదా.. అదేంటీ మానవుల మాంసాన్ని మానవులు ఎలా తింటారు? అని అనుమానపడతారు కూడా. కానీ, అది నిజమేనని పోలీసులు తేల్చారు. ఇంతకీ ఏ దేశంలో ఈ ఘటన జరిగింది? ఎంత మంది మనుషులను మానవులు తిన్నారు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరిని చదవాల్సిందే.

పురాతన కాలంలో మనుషులు చనిపోయిన తర్వాత వారి రక్తాన్ని తాగినట్లు పలువురు చరిత్ర అధ్యయనం చేసిన వారు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలపై అన్వేషణ కూడా కొనసాగుతున్నది. అలా చనిపోయిన మనుషుల రక్తాన్ని తాగితే వ్యాధులు నయమవుతాయనేది వారి నమ్మకం. ఈ క్రమంలోనే మనుషులను చంపి ఓ జంట వారి మాంసాన్ని తింటుందన్న సంగతి రష్యా పోలీసులు తేల్చారు. రష్యా దేశంలోని క్రాస్నొదర సిటీలో నివాసముంటున్న దంపతులు 35 ఏళ్ల దిమిత్రీ బక్షీవ్, 42 ఏళ్ల నతాలియా నరమాంస భక్షకులు. ఈ జంట దాదాపు ముప్పై మందిని చంపి వారి మాంసాన్ని తిన్నది. మనుషులను చంపి వారి శరీర భాగాలను ముక్కలు, ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్‌లో దాచుకుని మరీ వాటిని తినేవారు.

ఇలా వారు తింటున్న క్రమంలో ఓ రోజు ఆ ఏరియాకు ఓ భవన నిర్మాణ కార్మికుడు వచ్చాడు. రోడ్డుపై ఓ ఫోన్ కనబడింది అందులో దిమిత్రీ బక్షీవ్ మానవ శరీర భాగాలను నోట్లో పెట్టుకుని తింటున్న ఫొటో ఒకటి కనిపించగా, వెంటనే ఈ విషయమై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్రాస్నొదర సిటీలోని దిమిత్రీ బక్షీవ్ ఇంటిని తనిఖీ చేశారు. ఆ తనిఖీలో వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. దిమిత్రీ ఇంట్లోని ఫ్రిజ్‌లో మానవ ఎముకలు, ఆ ఎముకలతో చేయబడిన పిండి వంటకాలు, వివిధ రకాల డిషెస్ దొరికాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దిమిత్రీ బక్షీవ్, నతాలియాను అదుపులోకి తీసుకుని వారిని విచారించారు. విచారణలో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి.

ఈ జంట డేటింగ్ యాప్ ద్వారా పలువురిని ట్రాప్ చేసి, ఇంటికి పిలిపించి మత్తు మందు ఇచ్చి వారు స్పృహ కోల్పోయాక చంపేశారని తేల్చారు. అలా వారు చనిపోయాక వారిని నరికి ఫ్రిజ్‌లో దాచి పెట్టుకుని మరి శరీర భాగాలను నరికి తినడం స్టార్ట్ చేశారు. మొత్తంగా ముప్పై మందిని కిడ్నాప్, ట్రాప్ చేసి చంపి వారి మాంసాన్ని తిన్నట్లు పోలీసులు తేల్చారు. 2017లో పోలీసులు నరమాంస భక్షకులను అరెస్టు చేశారు. కాగా, నరుల మాంసాన్ని తిన్న వీరి సాధారణ మానవుల మాదిరిగా జీవించడం పట్ల పలువురు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు.

దాదాపు ఇరవై ఏళ్ల పాటు మనుషుల మాంసాన్ని తినే వారు జీవించినట్లు పోలీసులు ప్రాథమిక నివేదికలో తెలిపారు. యాప్స్ ద్వారా ట్రాప్ చేయడంతో పాటు కొందరిని డైరెక్ట్‌గా కిడ్నాప్ చేసి వారి ఇంటికి తెచ్చుకుని చంపేసి వారి శరీర భాగాలను కోసుకుని తిన్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.