Begin typing your search above and press return to search.
రష్యా వ్యాక్సిన్ భారత్ కు వచ్చేసింది.. చివరదశ ట్రయల్స్‌కు రంగం సిద్ధం
By: Tupaki Desk | 12 Nov 2020 2:00 PM ISTరష్యా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందరికంటే ముందుగా తయారుచేసిన స్పుత్నిక్‌వీ కరోనా వ్యాక్సిన్ ఇండియాకు వచ్చేసింది. త్వరలోనే మనదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో సంయుక్తంగా రెడ్డి ల్యాబ్స్ ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో పాలుపంచుకోనున్నది. ఇప్పటికే వ్యాక్సిన్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నది. స్పుత్నిక్ వీపై ప్రపంచవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 17 శాతం మందికి సైడ్ఎఫెక్ట్స్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి.
అయితే మనదేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడో దశ ట్రయల్స్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పై 1,2 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. భారతదేశంలో పెద్ద ఎత్తున మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రెడ్డి ల్యాబ్స్ సన్నద్ధం చేస్తోంది. మూడో దశ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత వెంటనే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రష్యా తమ కరోనా వ్యాక్సిన్ 92 శాతానికి పైగా సమర్థవంతంగా పనిచేయగలదని ప్రకటించింది. ఫైజర్ ప్రకటించిన రెండు రోజుల తర్వాత రష్యా సావరెన్ వెల్త్ ఫండ్ ఆర్డీఐఎఫ్ కూడా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సమర్థతపై ప్రకటన జారీ చేసింది. ఇటీవలే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరగ్గా.. అందులో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేసిందని రష్యా పేర్కొంది. కరోనా సోకిన 20 బాధితులకు ప్లేసిబో తీసుకున్న వారికి స్పుత్నిక్ వ్యాక్సినేషన్ తీసుకున్నవారికి సంబంధించి డేటాను ఆర్డీఐఎఫ్ వెల్లడించింది.