Begin typing your search above and press return to search.
స్విట్జర్లాండ్ ఆంక్షలకు షాకిచ్చిన రష్యా
By: Tupaki Desk | 30 March 2022 3:30 AM GMTఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాపై యూరప్ దేశమైన స్విట్జర్లాండ్ తాజాగా ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే రష్యా సైతం స్విట్జర్లాండ్ దేశానికి గట్టి షాక్ ఇచ్చింది. రష్యాలో తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్న విదేశీ సంస్థల ఆస్తులను సీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు రష్యన్ అధికారులు. గత కొన్ని వారాల్లో ఈ చర్యలు మరింతగా పెరగనున్నాయి. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ కు చెందిన ప్రఖ్యాత స్విస్ గడియారాలను మాస్కో బ్రాంచీ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభమైన తరువాత, ఈ సంస్థ రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. స్విట్జర్లాండ్ గత ఏడాది రూ.2126 కోట్ల విలువైన గడియారాలను ఎగుమతి చేసిందని పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. కానీ రష్యాలో లగ్జరీ వస్తువులకు ఉన్న డిమాండ్ బట్టి చూస్తే వీటి మార్కెట్ విలువ అంతకన్నా చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే రష్యాసర్కార్ సుమారు రూ.75949 కోట్ల విలువ చేసే లీజుకు తీసుకున్న విదేశీ జెట్లను రష్యా నిలిపివేసింది. ఈ విమానాలను వెనక్కి తిరిగి ఇవ్వమని యజమానులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చింది.
రష్యా నుంచి వైదొలుగుతున్న పాశ్చాత్య కంపెనీల ఆస్తులను జాతీయం చేయడానికి రష్యా కొత్త చట్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని రష్యా మాజీ అధ్యక్షుడు తెలిపారు. ఈ క్రమంలోనే స్విస్ దేశానికి చెందిన కోట్లు విలువ చేసే ‘ఆడెమర్స్ పిగెట్’ వాచీలను రష్యా అధికారులు జప్తు చేసినట్లు తెలిసింది. మంగళవారం రష్యా సెక్యూరిటీ సర్వీస్ ఏజెంట్లు ఈ వాచీలను మాస్కోలోని ఒక దుకాణం నుంచి స్వాధీనం చేసుకున్నారని స్విస్ మీడియా తెలిపింది. కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకే వీటిని సీజ్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
స్విట్జర్లాండ్ తన తటస్థ వైఖరిని విడిచిపెట్టి రష్యాపై ఆంక్షలు విధించిన కొద్దిరోజులకే రష్యా ఇలా ఆ దేశపు ఖరీదైన కోట్ల విలువ చేసే వాచీలను స్వాధీనం చేసుకొని షాక్ ఇచ్చింది. దీనిపై స్విస్ నుంచి ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఒక్కో ఆడెమర్స్ పిగెట్ వాచ్ ధర ఏకంగా సుమారు రూ.7 కోట్లు ఉంటుంది.