Begin typing your search above and press return to search.

ఆగస్ట్ 12న రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల !

By:  Tupaki Desk   |   31 July 2020 4:20 PM IST
ఆగస్ట్ 12న రష్యా కరోనా వ్యాక్సిన్ విడుదల !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని బయటపడటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే , రోజురోజుకి కరోనా విజృంభణను చూస్తుంటే కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు కంట్రోల్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రపంచానికి రష్యా శుభవార్త తెలిపింది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా టీకా ను ఆగస్టు 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు రష్యా చెబుతోంది. రష్యాకు చెందిన గామాలెయ ఇన్‌ స్టిట్యూట్‌, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ ‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తున్నాయి. డ్రగ్ రెగ్యూలేటర్ల నుంచి అనుమతి లభిస్తే సాధ్యమైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ‘బ్లూమ్ ‌బర్గ్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది.

రష్యాలోనే మరో టీకాకు మానవ ప్రయోగాల దశ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. జూలై 27న ఐదుగురు వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారని, వారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్‌ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.

వ్యాక్సిన్ ను మేమే తొలుతగా విడుదల చేయాలనే తొందర్లో రష్యా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. రష్యా టీకాకు రెండో దశ ట్రయల్స్‌ కూడా పూర్తి కాలేదని, ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా ప్రయోగాలు దీనికన్నా ముందంజలో ఉన్నాయని వార్తలు వచ్చాయి. అలాగే , కొందరు నిపుణులు చివరి దశ ట్రయల్స్ పూర్తికాకముందే త్వరగా కరోనా వ్యాక్సిన్ ‌ను మార్కెట్లోకి తెస్తామని ప్రకటనలు చేయడం ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. అయితే, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని రష్యా అంటోంది.