Begin typing your search above and press return to search.
బైడెన్ గెలుపును గుర్తించం.. రష్యా అధినేత సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 23 Nov 2020 11:30 AM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. జో బైడెన్ గెలుపొందారు. అధికారమార్పిడి కూడా జరుగుతున్నది. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ మాత్రమ ఓటమిని అంగీకరించడం లేదు. బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని.. రిగ్గింగ్ చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్‌కు వంతపాడుతున్నాడు. జో బైడెన్ గెలుపును తాను గుర్తించడం లేదని స్పష్టం చేశారు.
ఏ దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రతిపక్ష పార్టీ కూడా ఓటమిని అంగీకరించాలి. అప్పుడే ఎన్నికలు సక్రమంగా జరిగినట్టు లెక్క. అంతేకాని ప్రతిపక్షం ఒప్పుకోకపోతే ఏదా తేడా ఉందని గమనించాలి. అమెరికా అధ్యక్షుడిగా ఏ పార్టీ వాళ్లు ఎన్నికైనా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బైడెన్ ను అధ్యక్షుడి గా తాను గుర్తించలేనని స్పష్టం చేశారు. కొత్తగా చెడిపోయేదేముంది అంటూ ఓ ప్రశ్నకు సమాధానం గా ఆయన చెప్పారు.
చైనా కూడా గతంలో జోబైడెన్ ను అధ్యక్షుడి గా ఒప్పుకోలేదు. శుభాకాంక్షలు చెప్పలేదు. చాలా రోజుల తర్వాత చెప్పింది. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు ఇలా వ్యాఖ్యానించడం ఆసక్తికరం గా మారింది. ‘అమెరికా తో మాకు ఎప్పుడో సంబంధాలు తెగి పోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎవరు అధ్యక్షుడిగా ఉన్న మాకు వచ్చే నష్టమూ.. లేదు లాభము లేదు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీ ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు చెప్పిందంటే ఆ విషయం గురించి మనం ఆలోచించుకోవాలి. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఓటమిని అంగీకరించినప్పుడే ఆ ఎన్నిక సంపూర్ణమవుతుంది. కానీ అమెరికా లో ఆ పరిస్థితి లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లో తప్పిదాలు జరిగాయని సాక్షాత్తూ మరో పార్టీ అభ్యర్థి ప్రకటిస్తున్నాడు. కాబట్టి మేము జో బైడెన్ ను ఇప్పటికైతే అధ్యక్షుడిగా గుర్తించ లేక పోతున్నాం’ అని పుతిన్ పేర్కొన్నాడు.