Begin typing your search above and press return to search.

నినాదాలు రాసి మరీ బాంబులేస్తున్న రష్యా

By:  Tupaki Desk   |   22 Nov 2015 4:07 AM GMT


ఉగ్రవాద దాడులతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ అంతం చేయటమే లక్ష్యంగా మొదలైన వేట మరింత ఉధృతంగా మారుతోంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ మీద ఉగ్రదాడి.. అంతకు కొద్ది రోజుల ముందు ఈజిప్ట్ లోని రష్యా విమానాన్ని కూల్చి వేయటం లాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. రష్యాతో పాటు పలు మిత్రదేశాలు సిరియాలోని ఐఎస్ స్థావరాల మీద యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది.

ఐఎస్ స్థావరాల మీద రష్యా విడుస్తున్న బాంబుల మీద నినాదాలు రాయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘‘మా ప్రజల కోసం.. పారిస్ కోసం’’ అంటూ రష్యా తన దాడుల కారణాన్ని చెప్పేస్తోంది. బాంబుల మీద నల్లటి అక్షరాలతో.. నినాదాలు రాస్తూ సిరియాలోని ఐఎస్ తీవ్రవాద క్షేత్రాల మీద బాంబులు విడుస్తున్నారు. నినాదాలతో కూడిన బాంబుల్ని జార విడుస్తున్న వీడియోను తాజాగా విడుదల చేశారు.