Begin typing your search above and press return to search.

ట్రంప్ షాకిస్తే.. పుతిన్ స్వీట్ న్యూస్ చెప్పారు

By:  Tupaki Desk   |   1 May 2017 4:36 PM GMT
ట్రంప్ షాకిస్తే.. పుతిన్ స్వీట్ న్యూస్ చెప్పారు
X
అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ‌కు షాకులిస్తూ.. నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ట్రంప్ బాట‌లోనే మ‌రికొన్ని దేశాలు న‌డుస్తున్న నేపథ్యంలో.. భార‌త ఐటీ వ‌ర్గాలు తీవ్ర నిరాశ‌కు గురి అవుతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. ఊహించ‌ని రీతిలో ర‌ష్యా అధినేత పుతిన్ స్వీట్ న్యూస్ చెప్పారు. హెచ్ 1బీ వీసాలపై ప‌రిమితుల్ని విధించిన ట్రంప్ తీరుకు బిన్నంగా.. భార‌త ఐటీ వ‌ర్గాల‌కు తాము స్వాగ‌తం ప‌ల‌క‌నున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన నాటి నుంచి హెచ్ 1బీ వీసాల విష‌యంలో అమెరిక‌న్ల‌కు హామీలు ఇచ్చిన ట్రంప్‌.. అద్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ఎన్నిక‌ల్లో తాను ఇచ్చిన హామీని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే హెచ్ 1బీ వీసాల జారీకి సంబంధించి నిబంధ‌న‌ల్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేయ‌టంతో పాటు.. ప‌రిమితులు విదించ‌టంతో భార‌త ఐటీ వ‌ర్గాలు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాయి.

ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా అమెరికా త‌ర‌హాలోనే మ‌రికొన్ని దేశాలు ట్రంప్ బాట ప‌ట్ట‌టంపై ఐటీ వ‌ర్గాలు త‌మ భ‌విష్య‌త్తు ఏమిట‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇలాంటి వేళ‌.. పుతిన్ ప్ర‌క‌ట‌న కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింద‌ని చెప్పాలి.
ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యానికి భిన్నంగా ర‌ష్యా భార‌త టెకీల కోసం త‌లుపుల్ని బార్లా తీస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ‌కు తాము త‌లుపులు తెరిచిన‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. సాఫ్ట్ వేర్ రంగంలో భార‌త ఐటీ స‌హ‌కారాన్ని త‌మ దేశం కోరుకుంటుంద‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. భార‌త ఐటీ ప‌రిశ్ర‌మ‌కు ఉతం ఇచ్చేలా ప్ర‌క‌ట‌న‌కు ముందుగా.. దేశీయ ఐటీ ఇండ‌స్ట్రీ.. నాస్కామ్ తో కూడా ర‌ష్య‌న్ టెలికం మాస్ క‌మ్యూనికేష‌న్ డిప్యూటీ మంత్రి ర‌షీద్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ర‌ష్యాతో పాటు.. కెన‌డా నుంచి కూడా భార‌త్ ఐటీ వ‌ర్గాల‌కు ఆహ్వానాలు అందుతున్నాయి.

ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం పుణ్య‌మా అని.. భార‌త ఐటీ వ‌ర్గాల‌కు స‌రికొత్త అవ‌కాశాల‌కు దారులు ఏర్ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ అభిప్రాయానికి బ‌లం చేకూరేలా భార‌త స‌ర్కారు కూడా వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. జూన్ లో మూడు రోజుల పాటు ర‌ష్యాలో జ‌రిగే స‌మావేశానికి ప్ర‌ధాని మోడీ ముఖ్య అతిధిగా పాల్గొన‌నున్న‌ట్లు నాస్కామ్ వెల్ల‌డించింది. అమెరికా ఆంక్ష‌ల నేప‌థ్యంలో ర‌ష్యా స్పంద‌న భార‌త్ కు క‌లిసి రావ‌టం ఖాయ‌మంటున్నారు. కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్‌.. ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌.. రోబోటిక్స్ లో ర‌ష్యా పురోగ‌మిస్తుంటే.. భార‌త్ సాఫ్ట్ వేర్ రంగంలో దూసుకెళుతోంది. తాజా క‌ల‌యిక‌తో ఇరు దేశాలు లాభ‌ప‌డ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/