Begin typing your search above and press return to search.

నరరూప రాక్షసులకు చుక్కలు చూపిస్తోంది

By:  Tupaki Desk   |   8 Oct 2015 11:51 AM IST
నరరూప రాక్షసులకు చుక్కలు చూపిస్తోంది
X
పురాణాల్లో రాక్షసుల కంటే కిరాతకంగా వ్యవహరిస్తూ.. అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలకు కొత్త భయాన్ని తెచ్చి పెట్టిన ఇస్లామిక్ స్టేట్ తీవ్ర వాద సంస్థకు రష్యా చుక్కలు చూపిస్తోంది. ఒకప్పుడు నాగరికతకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సిరియాలో రక్తటేరులు పారించటమే కాదు.. ఆరాచకానికి నిలువెత్తు నిదర్శనంగా మార్చేసి.. అక్కడి ప్రజలకు నరకం అంటే ఏమిటో చూపించటమే కాదు.. సిరియా స్థావరంగా చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించటానికి ఐసిస్ ప్రయత్నించటం తెలిసిందే.

దీంతో.. ఇస్లామిక్ స్టేట్ అరాచకాలకు చెక్ చెప్పేవారు ఎవరూ లేరా? అన్న ప్రశ్నలు చెలరేగాయి. అగ్రరాజ్యాలు చూసీ చూడనట్లుగా వ్యవహరించిన దానికి.. సిరియాలోని ప్రజలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల బాధలు భరించలేక పెద్ద ఎత్తున వలసలు మొదలెట్టటంతో అగ్రరాజ్యాలకు చురుకుపుట్టింది. దీంతో.. ఐసిస్ మీద యుద్ధ ప్రకటించాయి.

రష్యా.. ఆస్ట్రేలియా.. ఫ్యాన్స్ దేశాలు ఇస్లామిక్ స్టేట్ సంస్థపై ప్రత్యక్ష యుద్దాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన రష్యా ఇస్లామిక్ స్టేట్ సంస్థకు చుక్కలు చూపిస్తోంది. రష్యా ప్రయోగిస్తున్న క్షిపణి దాడులకు తల్లడిల్లిపోతోంది. తాజాగా రాత్రివేళలో ప్రయోగించిన క్షిపణితో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఆయుధ ఫ్యాక్టరీతో పాటు.. ఆయుధాలు నిల్వ ఉంచే గిడ్డండి.. తీవ్రవాదుల శిక్షణకు ఉపయోగించే శిబిరంతో పాటు.. ఇంధన నిల్వలున్న ప్రాంతాల్ని సమూలంగా నాశనం చేశాయని చెబుతున్నారు. తాజా దాడి ఐసిస్ కు కోలుకోలేనంత దెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. మరి.. తమపై జరుగుతున్న దాడులకు ఐసిస్ రాక్షసులు ఎలా స్పందిస్తారో..?