Begin typing your search above and press return to search.
‘మాకు కరోనా టీకాలు వేయకండి’ రష్యన్లకు టీకా అంటేనే భయం పట్టుకుందా?
By: Tupaki Desk | 4 Nov 2020 6:00 AM ISTకరోనాకు టీకా ఎప్పడొస్తుందా అని యావత్ ప్రపంచం ఎదురుచేస్తున్నది. ఇప్పటికే పలు కంపెనీలు టీకాలు తయారు చేసి క్లినికల్ ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నాయి. రష్యా ప్రభుత్వం ఓ అడుగు మందుకేసి టీకా పంపిణీని కూడా మొదలు పెట్టింది. రష్యా టీకా సేఫ్ కాదని.. క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదని పలు దేశాల శాస్త్రవేత్తలు మొత్తకుంటున్నా రష్యా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీకా మూడో దశ ట్రయల్స్ ఫెయిల్ అయ్యాయని.. టీకా తీసుకున్న వాళ్లలో 17 శాతం మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆ దేశ ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే టీకా పంపిణీలో రష్యా సర్కారుకు కొత్త చిక్కులు వచ్చాయట. ఆ దేశ ప్రజలెవరూ రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వీ టీకాను తీసుకోవడం లేదని సమాచారం.
రష్యా ప్రజలెవరూ టీకాలు వేయించుకోవడానికి ఇష్టపడటం లేదని ఓ సర్వే తేల్చి చెప్పింది. పోల్స్టర్ లెవాడా సెంటర్ నిర్వహించిన పోల్ లో ఈ విషయం వెల్లడి అయింది. అక్టోబర్ 20 నాటికి 59% రష్యన్లు టీకాను తిరస్కరించారట. ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్ ను ఆ దేశం తయారు చేసింది. ఓ వైపు పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకపోవడం.. మరోవైపు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుండటంతో రష్యా వైద్యశాఖ తీవ్ర ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో టీకాలను తీసుకోవడానికి ప్రజలు నిరాకరిస్తుండటంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీకా తీసుకున్న వారు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయట. ఈ సవాళ్లను ఎదుర్కొని రష్యా ప్రభుత్వం టీకా పంపిణీని ఎలా కొనసాగిస్తుందో వేచి చూడాలి.