Begin typing your search above and press return to search.

పల్లె పోరు : ఆ గ్రామంలో బోణి కొట్టిన కాంగ్రెస్ .. సంబరాల్లో మునిగిపోయిన కార్యకర్తలు !

By:  Tupaki Desk   |   10 Feb 2021 9:00 PM IST
పల్లె పోరు : ఆ గ్రామంలో బోణి కొట్టిన కాంగ్రెస్ .. సంబరాల్లో మునిగిపోయిన కార్యకర్తలు !
X
కాంగ్రెస్ .. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా ఉండేది. కానీ , రాష్ట్రం విడిపోవడంతో ఏపీలో పూర్తిగా నాశనం అయింది. అలాగే తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇదిలా ఉంటే .. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది హస్తం పార్టీ. పంచాయతీ ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించింది. తొలి విడత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామ సర్పంచ్ ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి గొంది సురేష్ విజయం సాధించారు.

దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణా సంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని సురేష్ చెప్పారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ విజయంతో ఆ పార్టీకి మళ్లీ జీవం వచ్చినట్లయింది. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

కాగా.. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2013పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేవేసింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరువేల గ్రామపంచాయతీలు కైవసం చేసుకుని తొలి స్థానంలో నిలించింది. 2014లోఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగలేదు.